హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న నవదీప్( Navdeep ) ప్రస్తుతం సినిమాలు, వెబ్ సిరీస్ లలో కీలక పాత్రల్లో నటిస్తూ కెరీర్ పరంగా బిజీగా ఉన్నారనే సంగతి తెలిసిందే.నవదీప్ నటించిన న్యూసెన్స్ అనే వెబ్ సిరీస్ ఈ నెల 12వ తేదీ నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుండగా ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా నవదీప్ షాకింగ్ విషయాలను వెల్లడించారు.

నా వల్ల ఒక హీరోయిన్ చనిపోయిందని గతంలో వార్తలు ప్రచారంలోకి వచ్చాయని అయితే ఆ వార్తల్లో నిజం లేదని నవదీప్ తెలిపారు.2005 సంవత్సరంలో నా గురించి ఈ వార్త ప్రచారంలోకి వచ్చిందని ఆయన కామెంట్లు చేశారు.నేను గే అని కూడా వార్తలు జోరుగా ప్రచారంలోకి వచ్చాయని అయితే నా గురించి జరిగిన ఈ ప్రచారంలో కూడా ఏ మాత్రం నిజం లేదని నవదీప్ అభిప్రాయం వ్యక్తం చేయడం గమనార్హం.
నేను అమ్మతో ఫార్మ్ హౌస్ లో ఉన్న సమయంలో రేవ్ పార్టీ( Rave Party )లో పాల్గొన్నట్టు ఒక వార్త వైరల్ అయిందని నేను రేవ్ పార్టీలో పాల్గొన్నట్టు జరిగిన ప్రచారంలో నిజం లేదని నవదీప్ కామెంట్లు చేశారు.
కొన్ని ఫేక్ వార్తల వల్ల మొదట కుటుంబ సభ్యులు కూడా నన్ను నమ్మలేదని అయితే ఆ తర్వాత నా తప్పేం లేకుండానే వార్తలు ప్రచారంలోకి వచ్చాయని వాళ్లు అర్థం చేసుకున్నారని నవదీప్ అన్నారు.

న్యూసెన్స్ వెబ్ సిరీస్( Newsense Web Series ) లో నేను జర్నలిస్ట్ గా నటించానని మీడియాపై కక్ష సాధింపు కోసం ఈ వెబ్ సిరీస్ లో నటించలేదని నవదీప్ చెప్పుకొచ్చారు.నవదీప్ టాలెంట్ కు ఎక్కడో ఉండాల్సిందని అయితే కెరీర్ పరంగా చేసిన చిన్నచిన్న తప్పులు మైనస్ అయ్యాయని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.







