కొంతమంది హీరో హీరోయిన్లు సినిమాల పరంగా బాగా డిమాండ్ చూపిస్తూ ఉంటారు.ముఖ్యంగా పారితోషకం విషయంలో అసలు తగ్గరు.
అంతేకాకుండా సినిమాలో కూడా చిన్న పాత్ర ఉంటే అస్సలు ఒప్పుకోరు.అలా ఓసారి నయనతార( Nayanthara ) కూడా ఒక స్టార్ హీరో సినిమాలో తన పాత్ర చిన్నగా ఉందంటూ డిమాండ్ చేయటంతో వెంటనే దర్శకుడు ఆమెపై ఫైర్ అయినట్టు తెలిసింది.
ఇంతకూ అసలు విషయం ఏంటో తెలుసుకుందాం.టాలీవుడ్ ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్ గా, మోస్ట్ గ్లామరస్ బ్యూటిగా అందరి హృదయాలను దోచుకున్న ముద్దుగుమ్మ నయనతార.
ఈమె గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరమే లేదు.నటనకు ప్రాణం పోసినట్లుగా నటిస్తుంది.
అలా ఎంతో మంది అభిమానుల హృదయాలను గెలుచుకున్న ఈ బ్యూటీ టాలీవుడ్( Tollywood ) లో స్టార్ హీరోయిన్ గా సెటిల్ అయ్యింది.ఇక లేడి ఓరియెంటెడ్ సినిమాలలో నయనతారను మించిన వారుండరని చెప్పవచ్చు.
ఈ బ్యూటీ తొలిసారిగా 2003 లో సినీ ఇండస్ట్రీకి అడుగు పెట్టింది.ఆ తర్వాత మూడేళ్లకు 2006లో తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం అయింది.
ఇక తెలుగుతో పాటు తమిళ, మలయాళ వంటి భాషల్లో కలిపి దాదాపు 30కి పైగా సినిమాల్లో నటించింది.

ఇక నయనతార హీరోయిన్ గా కంటే వ్యక్తిగత విషయంలో కూడా బాగా హాట్ టాపిక్ గా నిలిచింది.అది కూడా తన ప్రేమ విషయంలో అందరి దృష్టిలో పడింది.ఇక తమిళ డైరెక్టర్ విగ్నేష్ శివన్( Director Vignesh Sivan ) తో కొంతకాలం ప్రేమాయణం నడిపగా చివరికి ఆయనను వివాహం చేసుకుంది.
అంతేకాకుండా సరోగసి ద్వారా ఇద్దరు కవల పిల్లలకు తల్లితండ్రులయ్యారు.దీంతో ఈ విషయంలో కూడా నయనతార దంపతులు బాగా హాట్ టాపిక్ గా మారారు.ఇక ప్రస్తుతం ఈ విషయం గురించి ఎవరు పట్టించుకోవడం లేదు.వారిద్దరూ తమ పిల్లలతో హ్యాపీగా గడుపుతున్నారు.
ఇక ఇద్దరు దంపతులు తమ బిజీ లైఫ్ లో గడుపుతున్నారు.అది ఈ సమయంలో నయనతారకు సంబంధించిన ఒక వార్త బాగా వైరల్ అవుతుంది.
ఇంతకు అదేంటంటే.గతంలో పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) నటించిన బ్లాక్ బస్టర్ మూవీ వకీల్ సాబ్ సినిమాలో దర్శకుడు ఈమెకు అందులో ఒక పాత్ర ఇచ్చినట్టు తెలిసింది.

నిజానికి ఆ సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్ గా ఎవరూ లేరు.అయితే అందులో అంజలి పాత్ర కోసం ముందు నయనతారను అప్రోచ్ అయ్యారట దర్శక నిర్మాతలు.కానీ నయనతార వెంటనే.అలాంటి చిన్న పాత్రను చేయను.క్యారెక్టర్ పెంచండి.నా డామినేషన్ ఉండాలి అంటూ కండిషన్ పెట్టిందట.
దీంతో ఆమె కండిషన్ కి డైరెక్టర్ కి కోపం రావడంతో వెంటనే అంజలిని ఫిక్స్ చేశాడని తెలిసింది.సీన్ కట్ చేస్తే ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది.
దీంతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాతో పాటు అందులో గుర్తింపు ఉన్న పాత్రనువదులుకున్న నయనతారను అప్పుడు అందరూ ఓ రేంజ్ లో ఏకీపారేశారు.







