బుల్లితెర యాంకర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న యాంకర్ వర్షిణి (Anchor Varshini) మరోసారి ఉప్పల్ స్టేడియం (Uppal Stadium) లో సందడి చేశారు.గురువారం సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ కోల్‌కతా నైట్ రైడర్స్( SRH vs KKR ) మ్యాచ్‌కు వర్షిణీ హాజరైంది.
ఇలా ఉప్పల్ స్టేడియంలో సందడి చేసినటువంటి ఈమె అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.ట్రెండీ వేర్ ధరించి వర్షిణి చాలా క్యూట్ లుక్స్ తో అందరిని ఆకట్టుకునేలా ఉన్నారు.
వర్షిణి గ్యాలరీలో చప్పట్లు కొడుతూ సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఎంకరేజ్ చేసింది.అయితే దురదృష్టవ శాత్తు కేకేఆర్ చేతిలో 5 పరుగుల తేడాతో పరాజయం పాలైంది.

ఇక గతంలో కూడా ఉప్పల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్ కు హాజరైనటువంటి ఈమె పెద్ద ఎత్తున స్టేడియంలో సందడి.అయితే ఆరోజు మ్యాచ్ జరిగినప్పుడు కూడా హైదరాబాద్ ఓటమి పాలైంది.అంతేకాకుండా ముంబై స్టార్ ప్లేయర్ సూర్య కుమార్ యాదవ్ తో ఈమె సెల్ఫీ దిగడం ఆ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఎంతోమంది నేటిజన్స్ ఈ ఫోటోపై కామెంట్లు చేస్తూ ఈమెను ట్రోల్ చేశారు.తాజాగా కూడా ఉప్పల్ స్టేడియంలో ఈమె సందడి చేయడంతో మరోసారి కూడా హైదరాబాద్ ఓటమిపాలైంది .

ఇలా రెండుసార్లు సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓటమి పాలు కావడంతో నేటిజన్స్ వర్షిణి పై దారుణమైన కామెంట్లు చేస్తున్నారు.వర్షిని దయచేసి మీరు ఇంకొకసారి స్టేడియం కు రాకండి మీరు స్టేడియంకి వచ్చిన ప్రతిసారి సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓటమి పాలవుతుంది.ఇకపై మీరు ఉప్పల్ స్టేడియంలోకి అడుగుపెట్టకండి అంటూ దారుణంగా కామెంట్లు చేస్తున్నారు.ఇక ఈమె కెరియర్ విషయానికి వస్తే.ప్రస్తుతం బుల్లితెర కార్యక్రమాలకు దూరమైనటువంటి వర్షిణి పలు సినిమాలలో నటిస్తూ బిజీగా మారిపోయారు.తాజాగా శాకుంతలం (Shaakuntalam) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.







