హైదరాబాద్ లో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి.సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో మాదకద్రవ్యాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
ఈ క్రమంలో ప్రధాన నిందితుడు నైజీరియన్ తో పాటు ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.నైజీరియన్ కు చెందిన డ్రగ్స్ కింగ్ పిన్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
కాగా రూ.కోట్ల విలువైన కొకైన్ ను పోలీసులు సీజ్ చేశారు.విదేశాల నుంచి కొకైన్ తెచ్చి విక్రయాలు చేస్తున్నట్లు గుర్తించినట్లు సీపీ తెలిపారు.ఇంజినీరింగ్ విద్యార్థులే టార్గెట్ గా డ్రగ్స్ సరఫరా చేస్తున్నారని పేర్కొన్నారు.







