పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) లాంటి హీరోతో ఒక సినిమా చేయాలని అందరికీ ఉంటుంది.కానీ ఆ అవకాశం కొందరికి మాత్రమే దొరుకుతుంది.
అలాంటి వాళ్లలో యంగ్ డైరక్టర్ సుజీత్ ఒకరు.ఇంతకు ముందు సుజీత్ ప్రభాస్( Sujeet Prabhas ) తో సాహో అనే సినిమా చేశారు ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద పెద్దగా ఆడలేదు దాంతో సుజీత్ కొద్దిరోజులు గ్యాప్ తీసుకొని చేస్తున్న సినిమానే ఓజి ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శెర వేగంగా నడుస్తుంది అందులో భాగంగానే రీసెంట్ గా పవన్ కళ్యాణ్ మీద కూడా కొన్ని సీన్స్ షూట్ చేసినట్లుగా తెలుస్తుంది.

ఇక ఈ సినిమా షూటింగ్ విషయాన్ని పక్కన పెడితే ఈ సినిమా స్టోరీ జపాన్ కి సంభందించిన ఒక గ్యాంగ్ స్టర్ మూవీగా తెలుస్తుంది సుజీత్ ఆ సినిమా స్టోరీ ని తీసుకొని కొన్ని మార్పులు చేర్పులు చేసి చేస్తున్నట్టుగా ఒక న్యూస్ నెట్లో తెగ ప్రచారం జరుగుతుంది… అయితే ఆ సినిమా యూనిట్ మాత్రం ఇదేది పట్టించుకోకుండా వాళ్ల పని వాళ్ళు చేసుకుంటూ వెళ్తున్నారు… ఇక ఎలక్షన్స్ కి ఒక వన్ ఇయర్ మాత్రమే ఉండటంతో ప్రస్తుతం అన్ని సినిమాల షూటింగ్స్ చేస్తూ పవన్ కళ్యాణ్ చాలా బిజీగా ఉన్నాడు.

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు, వినోదయ సీతం రీమేక్,ఉస్తాద్ భగత్ సింగ్, ఓజి సినిమాలను కంప్లీట్ చేసే పనిలో ఉన్నాడు.ఇక ఈ సినిమాలని పూర్తి చేసి ఎలక్షన్స్ క్యాంపెయిన్ లో పాల్గొనాలని చూస్తున్నాడు…ఈసారి జరిగే ఎలక్షన్స్ లో పవన్ కళ్యాణ్ తన జనసేన పార్టీ సత్తా ఎంతో చూపించబోతున్నాడు.ఈ ఎలక్షన్స్ తర్వాత పవన్ కళ్యాణ్ సినిమాలు చేస్తాడా లేదా అనేది ఇంకా క్లారిటీ లేదు…
.







