మెగాస్టార్ చిరంజీవి గురించి పరిచయం అవసరం లేదు ఆయన చేసిన సినిమాలు చూసి హీరో అంటే ఇలా ఉంటాడు అనేంత ముద్ర వేయించుకున్న ఒకే ఒక హీరో చిరంజీవి…ఇక ఇది ఇలా ఉంటే ప్రస్తుతం చిరంజీవి( Chiranjeevi ) రాజకీయ రీ ఎంట్రీపై తరచు చర్చలు సాగుతూనే ఉన్నాయి .చిరు సినిమాలకే పరిమితం అని చెబుతున్నా రాజకీయాల్లో రాక గురించి వార్తలు వస్తూనే ఉన్నాయి.
రాజకీయాలకి గుడ్ బై చెప్పనప్పటి నుంచి చిరు సినిమాలకే ప్రాధాన్యత ఇస్తూ వస్తున్నారు…అన్ని రాజకీయ పార్టీలతోనూ అవసరం మేరకు కలుపుగోలుగా ఉంటూ.అందరివాడిగా ముందుకుపోతున్నారు.

ఈ క్రమంలో చిరంజీవి పొలిటికల్ ఎంట్రీ అంటూ ఒక వార్త వెలుగులోకి వచ్చింది.మెగాస్టార్ చిరంజీవికి ప్రధాని నరేంద్ర మోడీ( Narendra Modi ) నుంచి ఆహ్వానం అందిందనే వార్త ప్రస్తుతం ఆన్ లైన్ లో హల్ చల్ చేస్తుంది.కర్నాటక ఎన్నికలు( Karnataka Elections ) ముగిసిన అనంతరం మెగాస్టార్ తో భేటీ కావాలని ప్రధాని మోడీ నిర్ణయించుకున్నట్టు ప్రచారం సాగుతుంది.మోడీ పిలుపు నిజమేనా అదే నిజం అయితే చిరు హస్తినకు వెళ్తారా వెళ్తే ఏమి మాట్లాడతారు అనేది ఆసక్తిగా మారింది.
తెలుగు సినీరంగంలో పలువురు సెలబ్రెటీలతో మోడీ ఇతర బీజేపీ నేతలు టచ్ లో ఉన్నారని కామెంట్లు వినిపిస్తుంటాయి.అయితే ఇప్పటివరకూ ఏ సెలబ్రెటీ కూడా బీజేపీకే ఓటెయ్యాలని ఎన్నికల ప్రచారాలు చేయలేదు.అయితే… ఈ విషయంలో మెగాస్టార్ సహాయాన్ని మోడీ కోరబోతున్నారని తెలుస్తుంది.ఇప్పటికే కర్నాటకలో బీజేపీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని సర్వేలు చెబుతున్నాయి ఈ ఏడాది చివర్లో తెలంగాణలో అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి.
ఈ ఎన్నికల్లో ఎలాగైనా సత్తా చాటలని బీజేపీ( BJP ) భావిస్తుంది .అందులో భాగంగానే అమిత్ షా ఇప్పటికే తెలంగాణపై దృష్టి సారించారు.సభలూ సమావేశాలు పెట్టి శ్రేణుల్ని ఎన్నికలకు సమాయత్తం చేస్తున్నారు .అయినా కూడా ఒక బలమైన సినీ గ్లామర్ కావాలని ఆలోచించిన మోడీ ఈ మేరకు చిరంజీవికి కబురు పంపారని తెలుస్తుంది.మరి చిరంజీవి మోడీ ఆహ్వానాన్ని మన్నిస్తారా లేక కేటీఆర్ తో ఉన్న సాన్నిహిత్యం నేపథ్యంలో సున్నితంగా తిరస్కరిస్తారా అన్నది వేచి చూడాలి…
.







