ఐపీఎల్ ( IPL ) లీగ్ భారత దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆదరణ పొందింది.ఎంతోమంది యువకులు ఐపీఎల్ వేదికగా తమ సత్తా చాటుతూ వెలుగులోకి వచ్చారు.
అంతేకాకుండా ఎంతోమంది ఆటగాళ్లు ఈ ఐపీఎల్ లో అద్భుత ఆటను ప్రదర్శించి భారత జట్టులో చోటు దక్కించుకున్నారు.ఈ ఐపీఎల్ సీజన్లో అద్భుత ఆటను ప్రదర్శిస్తూ భవిష్యత్తులో టీమిండియా జట్టులోకి అవకాశం దక్కే ఆటగాళ్లు ఎవరో చూద్దాం.
యశస్వి జైస్వాల్:
ఈ ఐపీఎల్ సీజన్లో ప్రత్యేకంగా నిలుస్తూ సరికొత్త రికార్డు సృష్టించాడు.తాజాగా ఆదివారం జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ జట్టు ఓటమిపాలైనప్పటికీ.
యశస్వి జైస్వాల్( Yashaswi Jaiswl ) మాత్రం అందరి ప్రశంసలు పొందుతున్నాడు.ఐపీఎల్ 1000వ మ్యాచ్లో 62 బంతుల్లో 16 ఫోర్లు, 8 సిక్సర్లతో చెలరేగి 124 పరుగులు చేశాడు.
దీంతో ఈ సీజన్లో ఆరెంజ్ క్యాప్ రేసులో తొలి స్థానానికి వచ్చేసాడు.ఐపీఎల్ చరిత్రలోనే ఇప్పటివరకు ప్లేయర్ నమోదు చేసిన అత్యధిక స్కోరు కావడంతో భవిష్యత్తులో టీం ఇండియా జట్టులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని చాలామంది ప్రశంసిస్తున్నారు.

రింకు సింగ్:
ఆఖరి ఓవర్లో ఐదు వరస సిక్సులు బాది కోల్ కత్తా కు అందించిన విజయం ఐపీఎల్ చరిత్రలో ఎప్పటికీ మర్చిపోలేం.అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ అద్భుత ఇన్నింగ్స్ ఆడిన రింకు సింగు అందరి దృష్టిలో పడ్డాడు.ఇప్పటివరకు ఆడిన 9 మ్యాచ్లలో 270 పరుగులు చేశాడు.ఇందులో 19 సిక్సర్లు, 15 ఫోర్లు ఉన్నాయి.ఇతనికి కూడా భారత జట్టులో చోటు దక్కే అవకాశాలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి.

తిలక్ వర్మ:
ఐపీఎల్ లో అదరగొడుతున్న ఈ తెలుగు కుర్రాడు అందరినీ ఆకట్టుకుంటున్నాడు.2022లో ముంబై జట్టు ( MI ) తరఫున ఎంట్రీ ఇచ్చి పేలవ ప్రదర్శనతో కాస్త నిరాశపరచినప్పటికీ.ఈ సీజన్లో మాత్రం అద్భుత ఆటను ప్రదర్శిస్తున్నాడు.
ఈ సీజన్ లో తొలి మ్యాచ్ లోనే 84 పరుగులతో బెంగళూరు పై విరుచుకుపడ్డాడు.ఆడిన 8 మ్యాచులలో మొత్తం 248 పరుగులు చేశాడు.
ఇతనికి కూడా భారత జట్టులో చోటు దక్కే అవకాశాలు ఉన్నాయి.

తుషార్ దేశ్ పాండే:
ఈ చెన్నై జట్టు బౌలర్ 9 మ్యాచ్ లలో 17 వికెట్లు పడగొట్టి పర్పుల్ క్యాప్ రేసులో నిలిచాడు.డెత్ ఓవర్లలో బౌలింగ్ చేస్తూ అందరిని ఆకట్టుకుంటున్నాడు.ఇతనికి కూడా బౌలర్ గా భారత జట్టులో చోటు దక్కే అవకాశం ఉంది.

సాయి సుదర్శన్:
ఇతను ఆడిన ఐదు మ్యాచ్లలో 176 పరుగులు చేశాడు.ఇతని ఆట తీరుపై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు.భవిష్యత్తులో భారత జట్టులో చోటు దక్కే అవకాశం ఉంది.







