హైదరాబాద్ మహా నగరంలో మరో విషాదం నెలకొంది.నీటిగుంతలో పడి ఆరేళ్ల బాలుడు మృతిచెందాడు.
ఈ విషాద ఘటన జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45లో చోటు చేసుకుంది.ఆడుకుంటూ ప్రమాదవశాత్తు గుంతలో పడినట్లు తెలుస్తోంది.
బాలుడి మృతితో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.
అనంతరం ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.







