ప్రస్తుతం లావాదేవీలన్నీ డిజిటల్ రూపంలోనే జరుగుతున్నాయి.చిరు వ్యాపారుల నుంచి పెద్దపెద్ద వ్యాపారుల వరకు అందరూ ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం( Phone Pay, Google Pay, Paytm ) లాంటి యాప్ ద్వారానే లావాదేవీలు జరుపుతున్నారు.
అంతేకాకుండా ఆన్లైన్ బ్యాంకింగ్ ద్వారా షాపింగ్ చేయడం, ఫుడ్ ఆర్డర్ చేయడం లాంటి లావాదేవీలు చేసేవారి సంఖ్య కూడా చాలా ఎక్కువగానే ఉంది.
బ్యాంకులు కూడా కస్టమర్ల సదుపాయాలకు అనుగుణంగా ఆన్లైన్ వేదికలపై పలు ఆఫర్లు, రివార్డులు కూడా ప్రకటిస్తున్నాయి.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆన్లైన్ బ్యాంకింగ్ లో కావలసిన ఎటువంటి లావాదేవీదైన చేసేయొచ్చు.ఈ లావాదేవీలకు ఫోన్ లేదా కంప్యూటర్ ద్వారా సులభంగా చేసుకోవచ్చు.ఎస్బీఐ కస్టమర్లు( SBI customers ) ఆన్లైన్ బ్యాంకింగ్ రిజిస్ట్రేషన్ కోసం ఇకనుంచి బ్యాంక్ బ్రాంచ్ కు వెళ్లాల్సిన అవసరం లేదు.ఇంట్లో కూర్చుని ఎంచక్కా ఆన్లైన్ బ్యాంకింగ్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.
ఒకసారి రిజిస్ట్రేషన్ చేసుకున్నాక సేవలను మొబైల్ ఫోన్ లేదా డెస్క్ టాప్ లేదా కంప్యూటర్ ద్వారా జరుపుకోవచ్చు.స్టెప్ బై స్టెప్ రిజిస్ట్రేషన్ విధానం చూద్దాం.

ముందుగా ఎస్బీఐ అధికారిక వెబ్సైట్లోకి వెళ్లి రిటైల్ బ్యాంకింగ్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి.ఆ తరువాత పర్సనల్ బ్యాంకింగ్ ను సెలెక్ట్ చేసి కంటిన్యూ టు లాగిన్ ని క్లిక్ చేయాలి.కింద టర్మ్ అండ్ కండిషన్లు అంగీకరిస్తున్నట్లు నిర్ధారిస్తే.ఒక న్యూ బ్రౌజర్ ఓపెన్ అవుతుంది.అక్కడ న్యూ యూజర్? రిజిస్టర్ హియర్/ యాక్టివేట్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి, న్యూ యూజర్ రిజిస్ట్రేషన్ ను సెలెక్ట్ చేసుకోవాలి.వెంటనే ఓ న్యూ బ్రౌజర్ ఓపెన్ అవుతుంది అందులో బ్యాంక్ ఖాతా నెంబర్, సీఐఎఫ్ నెంబర్, బ్రాంచ్ కోడ్, కంట్రీ, రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్, క్యాప్సా కోడ్ ఎంటర్ చేయాలి.
తర్వాత ఫుల్ ట్రాన్సాక్షన్స్ రైట్స్ ఎంపిక చేసి, ఐ ఎగ్రీ అనే బటన్ పై క్లిక్ చేసి సబ్మిట్ బటన్ నొక్కండి.

ఆ తర్వాత మొబైల్ కు ఒక ఓటిపి వస్తుంది.దాన్ని ఎంటర్ చేసి కన్ఫార్మ్ చేయాలి.వెంటనే అక్కడ రెండు ఆప్షన్లు ఓపెన్ అవుతాయి.
ఐ హావ్ మై ఏటీఏం కార్డ్, ఐ డూ నాట్ హావ్ మై ఏటీఏం కార్డ్ అనే ఆప్షన్లలో మొదటిదానిని సెలెక్ట్ చేయాలి.తరువాత నెట్ బ్యాంకింగ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కావాలంటే ఏటీఎం కార్డ్ తప్పనిసరి.
ఆ తర్వాత సబ్మిట్ బటన్ పై క్లిక్ చేస్తే తాత్కాలిక యూజర్ నేమ్ స్క్రీన్ పై కనిపిస్తుంది.తరువాత నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్ టైప్ చేసి రిజిస్టర్ చేసుకోవాలి.
రిజిస్టర్ అయిన తర్వాత తాత్కాలిక యూజర్ ఐడి, పాస్వర్డ్ లతో ఎస్బీఐ అధికారిక వెబ్సైట్లోకి లాగిన్ అవ్వాలి.ఆ తర్వాత శాశ్వత యూజర్ నేమ్, పాస్వర్డ్ సెట్ చేసుకుని లావాదేవీలు కొనసాగించవచ్చు.







