Prabhu Deva : హమ్మయ్యా మొత్తానికి రెండో భార్యను పరిచయం చేసిన ప్రభుదేవా.. కానీ?

తెలుగు సినీ ప్రేక్షకులకు డాన్స్ కొరియోగ్రాఫర్ ప్రభుదేవా( Prabhu Deva ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ఇండియన్ మైకల్ జాక్సన్ గా గుర్తింపు తెచ్చుకున్నారు ప్రభుదేవా.

 Prabhudeva Spotted With His Second Wife Himani Singh At Tirumala Temple Photos-TeluguStop.com

ఒకప్పుడు సినిమాలలో నటుడిగా నటించడంతోపాటు ఎన్నో సినిమాలకు కొరియోగ్రాఫర్ గా వ్యవహరించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నారు.ఇది ఇలా ఉంటే కొరియోగ్రాఫర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రభుదేవా అప్పట్లో కొన్ని వివాదాలతో వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే.

మొదటి భార్యతో విడాకులు ఆ తర్వాత నయనతార( Nayanthara )తో ప్రేమ, పెళ్లి వరకు వెళ్లి చివరి నిమిషంలో విడిపోవడంతో ఆ వార్త కాస్త నార్త్ సౌత్ లో సంచలనంగా మారిన విషయం తెలిసిందే.

ప్రభుదేవా జీవితంలో ప్రేమ పెళ్లి అనేవి చేదు సంఘటనలుగా మిగిలిపోయాయి.వ్యక్తిగత విషయాల వల్ల సినిమాలపై కూడా సరిగ్గా ఫోకస్ చేయలేకపోయారు ప్రభుదేవా.ఇక నయనతార తో పెళ్లి ఆగిపోయిన తర్వాత 2020లోకరోనా మహమ్మారి సమయంలో హిమానీ సింగ్ ని( Himani singh ) రెండో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.

కానీ పెళ్లి తర్వాత ఈ జంట ఎక్కువగా కనిపించలేదు.అంతేకాకుండా చాలామంది అభిమానులు ప్రభుదేవా రెండో భార్య హిమానీ సింగ్ ని అసలు చూడలేదు.ఇది ఇలా ఉంటే తాజాగా ప్రభుదేవా తన రెండవ భార్యతో కలిసి తిరుమల తిరుపతి శ్రీవారిని దర్శించుకున్నారు.

తన భార్య హిమానీ సింగ్‏తో తిరుమలలో కనిపించారు.తన భార్య చేయి పట్టుకుని ప్రభుదేవా నడుస్తున్న ఫోటోస్, వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.అయితే ప్రభుదేవా రెండో భార్య బయట కనిపించింది అని సంతోషపడేలోపే ఆమె మాస్కు ధరించడంతో అభిమానులు కనీసం ఆమె ముఖం కూడా చూడలేదు అంటూ నిరాశ చెందుతున్నారు.

ప్రభుదేవా రెండో భార్య హిమానీ ఎక్కువగా బయట కనిపించరు.

అంతేకాదు ఆమె సోషల్ మీడియాలోనూ ఉండరు.ఈ మధ్యకాలంలో సినిమాలకు దూరంగా ఉంటున్నారు ప్రభుదేవా.అప్పుడప్పుడు బుల్లితెరపై పరిశోలకు జడ్జిగా కూడా వ్యవహరిస్తూ ఉంటారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube