తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ గా నటించిన భూమిక ( Bhumika )ఎలాంటి అద్భుతమైన సినిమాలలో నటించి మెప్పించారో అందరికీ తెలిసిందే.టాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్ర హీరోలు అందరి సరసన నటించి ఎన్నో సూపర్ హిట్ సినిమాలను అందుకున్నటువంటి భూమిక ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు.
ఇలా తన సెకండ్ ఇన్నింగ్స్ లో వరుస సినిమాలలో కీలక పాత్రలలో నటిస్తూ మెప్పిస్తున్నారు.ఇక తాజాగా వెంకటేష్ సల్మాన్ ఖాన్ హీరోలుగా నటించిన కిసీ కా భాయ్ కిసీ కీ జాన్( Kisi Ka Bhai Kisi Ki Jaan ) సినిమాలో వెంకటేష్ భార్య పాత్రలో నటించారు.

ఈ సినిమాలో ఈమె వెంకటేష్( Venkatesh ) భార్యగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.అయితే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి భూమిక యువ హీరోలతో రొమాన్స్ చేస్తే తప్పేంటి అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు.ప్రస్తుతం నాలుగు పదుల వయసులో ఉన్నటువంటి భూమిక ఇలా కుర్ర హీరోలతో రొమాన్స్ చేస్తే తప్పేంటి అంటూ చేసినటువంటి ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మలైకా అరోరా-అర్జున్ కపూర్, ప్రియాంక చోప్రా-నిక్ జోనాస్ రిలేషన్ ని జనాలు ఎందుకు ఒప్పుకోవడం లేదు.వారిని ఎందుకు భిన్నంగా చూస్తున్నారో నాకు అర్థం కావడం లేదు అంటూ అసహనం వ్యక్తం చేశారు.హీరోలు తమ వయసు కంటే సగం వయసు ఉన్న హీరోయిన్లతో రొమాన్స్ చేస్తే తప్పులేదు కానీ హీరోయిన్స్ మాత్రం తమకన్నా వయసులో చిన్న వారితో రొమాన్స్ చేస్తే తప్పేంటి? ఈ విషయంలో మగవారికి ఒక న్యాయం ఆడవారికి మరొక న్యాయమా అంటూ వరుస ప్రశ్నలు కురిపించారు.ఇలా ఈ ఇంటర్వ్యూలో భూమిక చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.







