ఏపీ సహజ వనరులకు నిలయమని మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు.జులైలో పారిశ్రామిక ఇన్సెంటివ్స్ విడుదల చేస్తామని తెలిపారు.
మే 3న భోగాపురం ఎయిర్ పోర్టుకు సీఎం వైఎస్ జగన్ శంకుస్థాపన చేస్తారని వెల్లడించారు.అదే రోజు అదానీ డేటా సెంటర్ కు సీఎం శంకుస్థాపన చేస్తారని పేర్కొన్నారు.
పరిశ్రమలకు సంబంధించి ప్రత్యేకమైన ల్యాండ్ బ్యాంక్ ఉందన్నారు.తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఒక్క హైదరాబాదే ఉందన్న ఆయన ఏపీలో ప్రతి ప్రాంతంలో పెట్టుబడులకు అవకాశాలు ఉన్నాయని వెల్లడించారు.







