పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) గురించి ఆయనకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు ఆయన సినిమా హిట్టు ప్లాప్ తో సంబందం లేకుండా సాధించిన వసూళ్లు కొట్టిన రికార్డ్ లే చెప్తాయి ఆయన గొప్పతనం గురించి, ఆయనకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి…అలాంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ లో మైలు రాయిగా నిలిచిన జల్సా, ఖుషి( Jalsa ) సినిమాలని ఇప్పటికే రీ రిలీజ్ చేశారు.స్టార్ హీరో కొత్త సినిమాకి కూడా చేయని విధంగా ఈ రెండు రీ రిలీజ్ లకి చాలా హంగామా చేశారు అభిమానులు…ఇలా చెయ్యడం గతం లో మీరెప్పుడు కూడా చూసి ఉండరు.మొదటి ఆట నుండి చివరి ఆట వరకు హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో ప్రభంజనం సృష్టించారు అభిమానులు… అలా మొదటి రోజు ఈ రెండు చిత్రాలు భారీ వసూళ్లనే రాబాట్టాయి…

ఈ రెండు సినిమాలు కూడా రీ రిలీజ్ అయిన సినిమాల్లో ఒక ఆల్ టైం సెన్సేషనల్ రికార్డును సాధించిన సినిమాలుగా చెప్పుకోవచ్చు…ఈ చిత్రాల తర్వాత ఎన్నో సినిమాలు రీ రిలీజ్ అయినప్పటికీ కూడా ఈ సినిమాలు సాధించిన రికార్డులని అందుకోలేకపోయాయి…పవర్ స్టార్ స్టామినా ఏంటో స్ట్రెయిట్ సినిమాలే కాకుండా రీ రిలీజ్ చేసిన సినిమాలు కూడా ప్రూవ్ చేస్తున్నాయి…

ఈ రెండు సినిమాలతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్ బేస్ ఎలాంటిదో మరోసారి అందరికీ అర్థం అయ్యేలా చేసాయి…ఇక ఇప్పుడు మళ్లీ పవన్ కళ్యాణ్ హిట్ సినిమా అయిన బద్రి సినిమా( Badri )ని కూడా రీ రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది…ఈ సినిమా కూడా జల్సా, ఖుషి సినిమాల మాదిరి గానే రీ రిలీజ్ లో ఒక ట్రెండ్ సెట్టర్ అవుతుందని అందరూ భావిస్తున్నారు.

పవన్ కళ్యాణ్ కొత్త సినిమాలు రావటానికి లేట్ అవుతుందని అతని ఫ్యాన్స్ నుండి వచ్చే ఒత్తిడిని తట్టుకోలేక వేస్తున్న ప్రతి సినిమా కూడా సూపర్ సక్సెస్ లుగా నిలుస్తున్నాయి… ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వరుసగా షూటింగ్ లు చేస్తూ ఖాళీ లేకుండా బిజీగా గడుపుతున్నాడు…
.







