కార్తీక్ దండు సుకుమార్ శిష్యుడు కాదా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన నిజం!

కార్తీక్ దండు ( Karthik Varma Dandu ).ప్రస్తుతం ఈ పేరు రెండు తెలుగు రాష్ట్రాల్లో మొత్తం మోగిపోతుంది.

 Karthik Dandu Isn't An Assistant Of Sukumar, Tollywod, Virupaksha, Bham Bolenat-TeluguStop.com

ఎందుకంటే ఈయన డైరెక్ట్ చేసిన విరూపాక్ష బ్లాక్ బస్టర్ దిశగా దూసుకు పోతుంది.సాయి తేజ్ ( Sai Dharam Tej ) హీరోగా సంయుక్త మీనన్ (Samyuktha Menon) హీరోయిన్ సుకుమార్ శిష్యుడు కార్తీక్ దండు తెరకెక్కించిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ ‘విరూపాక్ష’(Virupaksha).

ఈ సినిమా ఏప్రిల్ 21న గ్రాండ్ గా రిలీజ్ అయి సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది.

ఈ సినిమా తర్వాత ఈ డైరెక్టర్ పేరు మారుమోగి పోతుంది.ఇప్పటికే ఈ సినిమా 50 కోట్ల క్లబ్ లో చేరేందుకు రెడీ అయిపోతుంది.అంతేకాదు కార్తీక్ దండు సుకుమార్ శిష్యుడు కావడంతో సక్సెస్ అయ్యాడు అనే వార్త కూడా బాగా స్ప్రెడ్ అయ్యింది.

సుకుమార్ కూడా ఈ సినిమా స్క్రిప్ట్ దగ్గర నుండి నిర్మాతగా కూడా వ్యవహరించడంతో అంతా నిజమే అనుకున్నారు.

అలాగే సుకుమార్ ( Sukumar) శిష్యుడు కాబట్టే హిట్ వచ్చింది అని సుక్కూ జాబితాలోనే ఈ సినిమా కూడా వేశారు.అయితే నిజానికి కార్తీక్ దండు సుకుమార్ శిష్యుడు కాదని ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.ఈ డైరెక్టర్ భంభోలేనాథ్ సినిమాతో డైరెక్టర్ అయ్యాడు కానీ ఈ సినిమా హిట్ అవ్వలేదు.

మరి ఆ తర్వాత విరూపాక్ష కథ రాసుకుని ఈయన నిర్మాతల చుట్టూ తిరిగారట.

అలా సుకుమార్ ఫ్రెండ్ అయిన ఒక నిర్మాత దగ్గరికి ఈ కథ రావడంతో సుకుమార్ కు కూడా ఈ కథ నచ్చి స్క్రిప్ట్ రాయడంతో సలహాలు సూచనలు ఇచ్చారట.అంతేకాదు ఈ కథ మీద నమ్మకంతో ఈయన నిర్మాణంలో కూడా భాగస్వామి అయ్యాడు.విరూపాక్ష సినిమాకు సుక్కు ఇచ్చిన కొన్ని కీలక సలహాలు ప్లస్ అయ్యాయి.

ఇలా సుకుమార్ సహాయంతో ఈ సినిమా హిట్ కొట్టేసాడు.అంతేకానీ కార్తీక్ దండు సుకుమార్ శిష్యుడు ( Sukumar assistant ) కాదు అని తెలుస్తుంది.

ఈ విషయం ఇప్పుడు అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube