దర్శక ధీరుడు రాజమౌళి( Rajamouli ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు ఆయన ఏ సినిమా చేసిన అది పక్క హిట్టు అవుతుంది అని అందరికీ ఒక స్థాయి నమ్మకం వచ్చేసింది.అందుకే ప్రతి ఒక్కరూ రాజమౌళి సినిమా ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటారు.
అయితే రాజమౌళి వాళ్ళ ఇంట్లో రాజమౌళి ఒక్కడే కాదు వాళ్ళ అన్న అయిన కీరవాణి వాళ్ళ వదిన శ్రీవల్లి( Srivalli ) రాజమౌళి భార్య రమ రాజమౌళి, వాళ్ళ నాన్న విజయేంద్ర ప్రసాద్, రాజమౌళి కొడుకు కార్తికేయ( Karthikeya ) వీళ్ళందరూ కలిసి పనిచేస్తారు అందుకే ఆయన తీసిన చాలా సినిమాలకి వీళ్ళే వర్క్ చేస్తూ వచ్చారు.ఇలా ఒక కుటుంబం మొత్తం సినిమా వర్క్ గురించి ఆలోచిస్తూ సినిమానే ప్రాణంగా బతికే వాళ్ళు వీరెనేమో…

ఇది ఇలా ఉంటే రాజమౌళి ప్రతి సినిమాకి రెమ్యూనరేషన్ తో పాటు సినిమా ప్రాఫిట్స్ లో వాటా పర్సంటేజ్ తీసుకుంటారు ఈ లెక్కనే బాహుబలి సిరీస్ కి 100 కోట్ల వరకు తీసుకున్నట్లు తెలుస్తుంది అలాగే మొన్న వచ్చిన ఆర్ ఆర్ ఆర్ మూవీ( RRR ) కి అయితే రాజమౌళి రెమ్యూనరేషన్ పర్సెంటేజ్ మొత్తం కలిపి దగ్గర దగ్గర 200 కోట్ల వరకు తీసుకున్నారు అని తెలుస్తుంది అయితే ఇప్పుడు చేయబోయే మహేష్ బాబు సినిమా( Mahesh Babu )కి ఎంత తీసుకుంటున్నారో తెలియాలి అంటే ఇంకా కొన్ని రోజులు వెయిట్ చెయ్యాలి.అయితే రాజమౌళి ఇంత భారీ రేంజ్ లో రెమ్యూనరేషన్ తీసుకోవడం లో రిజన్ కూడా ఉంది పగలు,రాత్రి అనకుండా సినిమా కోసం మాత్రమే పని చేసే పని రాక్షసుడు రాజమౌళి కాబట్టి ఆయనకి ఎంత ఇచ్చిన తక్కువే అవుతుంది అని చాలా మంది అంటున్నారు…

రాజమౌళి చాలా తెలివైన వ్యక్తి అనేది మన అందరికీ తెలిసిందే అసలు విషయం ఎంటి అంటే ఆయన డ్రీమ్ ప్రాజెక్టుగా చెప్పబడే మహాభారతం సిరీస్( Mahabharatam ) కి తనే ప్రొడ్యూస్ చేసుకోవాలనే ప్లాన్ లో ఉన్నట్టు తెలుస్తుంది.దాదాపు ఈ ప్రాజెక్ట్ కోసం ఇండియాలో ఉన్న టాప్ మోస్ట్ హీరోలు అందరూ నటిస్తారు కాబట్టి దీనికి ఎంత మనీ అయిన దానికి 4 రెట్లు ఎక్కువ మనీ రిటర్న్స్ రూపం లో వస్తుంది కాబట్టి రాజమౌళినే ఈ సినిమాని డైరెక్షన్ చేసి ప్రొడ్యూస్ కూడా చేసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి అటు ప్రొడ్యూసర్ గా, ఇటు డైరెక్టర్ గా డబుల్ సక్సెస్ కొట్టే దిశలో ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది…చూడాలి మరి రాజమౌళి ప్లాన్ సక్సెస్ అవుతుంది లేదో…
.







