మ్యాగజైన్ కోసం హాట్ ఫోటో షూట్ చేసిన మృణాల్... మా సీతవు కాదంటూ నెటిజన్స్ కామెంట్!

సీతారామం (Sitaramam) సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు సీతామహాలక్ష్మిగా పరిచయమయ్యారు నటి మృణాల్ ఠాకూర్(Mrunal Thakur).ఈ సినిమాలో ఈమె అచ్చమైన తెలుగు అమ్మాయిగా నిండుదనంగా చీర కట్టుకొని ఎంతో పద్ధతిగా నటించారు.

 Heroine Mrunal Thakur Glamor Show For First Look Magazine Pics Viral Details, Mr-TeluguStop.com

ఇలా ఈ పాత్ర ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈమె మొదటి సినిమాతోనే ఎంతో మంచి విజయాన్ని అందుకోవడమే కాకుండా ఎంతో మంది తెలుగు ప్రేక్షకులను కూడా సొంతం చేసుకున్నారు.ఇలా సీతామహాలక్ష్మి పాత్రలో ఒదిగిపోయిన ఈమెకు తెలుగులో వరుస సినిమా అవకాశాలు వస్తున్నాయి.

ప్రస్తుతం తెలుగు సినిమాలతో పాటు ఇతర భాష సినిమాలతో కూడా బిజీగా ఉన్నారు.

వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమె సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తన గ్లామరస్ ఫోటోలను షేర్ చేస్తున్నారు.ఈ సినిమాకు ముందు కూడా ఈమె సోషల్ మీడియాలో ఎన్నో బోల్డ్ ఫోటోలను షేర్ చేశారు.అయితే ఇప్పుడు కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున గ్లామర్ షో చేస్తూ ఫోటోలను షేర్ చేయడంతో ఎంతోమంది అభిమానులు అసలు మేము చూసిన, అభిమానించిన సీతామహాలక్ష్మి నేనా ఇక్కడ అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

ఇదిలా ఉండగా తాజాగా ఈమె ఒక మ్యాగజైన్ కోసం పెద్ద ఎత్తున ఫోటోషూట్ చేయించారు.ఫస్ట్ లుక్ (First Look)అనే మ్యాగజైన్ కోసం ఈమె ఫోటో షూట్ చేయించడమే కాకుండా అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఒక్కసారిగా ఈ ఫోటోలు వైరల్ అయ్యాయి.ఈ ఫోటోలు చూసిన కొందరు నెటిజన్స్ ముందు మీరు ఆ ఫోటోలను డిలీట్ చేసేయండి అంటూ కొందరు కామెంట్లు చేయగా మరికొందరు నువ్వు మా సీతామహాలక్ష్మివి కాదు అంటూ కామెంట్లు చేస్తున్నారు.ఏది ఏమైనా ఈమె తన హాట్ ఫోటోలతో సోషల్ మీడియాను షేక్ చేస్తుందని చెప్పాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube