ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్( Smart phone ) అనేది తప్పనిసరి వస్తువు అయిపోయింది.దాంతో ప్రతి ఒక్కరు దానిని కొనుక్కోవాల్సిన అవసరం ఏర్పడింది.
అయితే మనకి ఒక్కోసారి కొత్త ఫోన్ కొనడానికి సరిపడా డబ్బులు సరిపోకపోవచ్చు.అలాంటప్పుడు సెకండ్ హ్యాండ్ మొబైల్ కొనుగోలు చేస్తూ ఉంటాము.
ఇలా సెకంఢ్ హ్యాండ్ మొబైల్ కొనే వారు కొన్ని విషయాలు తప్పక గుర్తించుకోవాలి.

ముందుగా మీరు ఎవరి వద్ద నుంచి సెకండ్ హ్యాండ్ మొబైల్ కొనుగోలు చేస్తున్నారో వారు మీకు తెలిసినవారైతే మంచిది.ఎందుకంటే నమ్మకమైన వారి వద్ద నుంచే పాత ఫోన్ కొనుగోలు చేయడం ఉత్తమం.
మరీ ముఖ్యంగా వారంటీ అనేది ఫస్ట్ చెక్ చేసుకోవాలి.
ఎందుకంటే ఫోన్ సరిగా పనిచేయకపోయినా దాన్ని మళ్లీ రిపేర్ చేసుకోవడం తేలిక.లేదంటే ఇబ్బందులు పడాల్సి వస్తుంది.
అలాగే ఫోన్ కొనే ముందు ఫిజికల్ డ్యామేజ్ ఏమైనా ఉందా? లేదా? అని చెక్ చేసుకోవాలి.నేరుగా షాపుకు వెళ్లి సెకండ్ హ్యాండ్ మొబైల్ కొనుగోలు చేస్తూ ఉంటే ఇబ్బంది ఉండదు.
అదే ఆన్‌లైన్ కొనుగోలు చేస్తూ ఉంటే మాత్రం జాగ్రత్తగా ఉండాలి.అన్ని చూసుకోవాలి.
ఇంకా బ్యాటరీ లైఫ్ కూడా చూడాలి.

అలాగే మీరు బ్యాటరీ( Battery )కి ఇక్కడ అధిక ప్రాధాన్యం ఇవ్వాలి.బ్యాటరీ లైఫ్ 80 శాతం కన్నా తక్కువ ఉంటే.ఆ ఫోన్ తీసుకోకపోవడమే ఉత్తమం.
అలాగే ఫోన్‌తో పాటు వచ్చే యాక్ససిరీస్ అంటే హెడ్ ఫోన్స్, మొబైల్ చార్జర్( Chargers ) వంటి వాటిని చూసుకోవాలి.ఎందుకంటే అవి డూప్లికేట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది.
అలాగే ధరను కూడా చెక్ చేసుకోవాలి.కొత్త ఫోన్ రేటుకు పాత ఫోన్ రేటుకు వ్యత్యాసం ఎక్కువగా లేకపోతే ఆ ఫోన్‌కు దూరంగా ఉండటం ఉత్తమం.