అక్కినేని హీరో అఖిల్ ( Akhil )నటించిన ఏజెంట్ చిత్రం( Agent ) వచ్చే వారం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.ఈ సినిమా షూటింగ్ ప్రారంభించినప్పటి నుండి కూడా పాన్ ఇండియా సినిమా అంటూ ప్రచారం చేశారు.
ఈ సినిమా అన్ని భాషల్లో విడుదలయితేనే బడ్జెట్ రికవరీ చేయగలరని కూడా సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేశారు.కానీ హిందీ మరియు ఇతర భాషల్లో సినిమా ను విడుదల చేయలేక పోతున్నామంటూ చిత్ర యూనిట్ సభ్యులు అధికారికంగా ప్రకటించారు.

కేవలం తెలుగు మరియు మలయాళం లో మాత్రమే సినిమా లు విడుదల చేయబోతున్నట్లుగా అధికారికంగా చిత్ర యూనిట్ సభ్యులు ప్రకటించారు.అతి త్వరలోనే హిందీలో కూడా విడుదల చేస్తామంటూ హీరో అఖిల్ ప్రకటించాడు.తెలుగు లో సూపర్ హిట్ అయితేనే హిందీలో విడుదల అయ్యే పరిస్థితి.కానీ అది ఎంత వరకు నిజమో చూడాల్సి ఉంది.ఈ మధ్య కాలంలో పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన సినిమాలు తెలుగు సినిమా పరిశ్రమ యొక్క పరువును పోగొట్టాయి.
దసరా ( Dasara )మరియు శాకుంతలం( Sakunthalam ) చిత్రాలు గొప్పలకు పోయి హిందీ లో విడుదల చేయడం జరిగింది.
ఆ రెండు సినిమాలు కూడా మినిమం కలెక్షన్స్ నమోదు చేయలేక పోవడం తో తెలుగు సినిమా పరిశ్రమ యొక్క పరువు పోయినంత పని అయిందని ఇండస్ట్రీ వర్గాల వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఇప్పుడు అదే పరిస్థితి ఏజెంట్ కి వస్తే అక్కినేని ఫ్యాన్స్ తీవ్రంగా హర్ట్ అయ్యే అవకాశాలున్నాయి.
అందుకే ముందు జాగ్రత్తగా హిందీ రిలీజ్ ని స్కిప్ చేసినట్టుగా తెలుస్తుంది.

ఒక వేళ సినిమా తెలుగు లో సూపర్ హిట్ అయ్యి మంచి వసూళ్లు నమోదు చేస్తే కచ్చితంగా తదుపరి వారం తమిళం, హిందీలో కూడా విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి.చిత్ర యూనిట్ సభ్యులు మాత్రం పాన్ ఇండియా స్థాయిలో సినిమా విడుదల చేయాలంటే రెండు నెలల ముందే షూటింగ్ పూర్తి చేసుకొని పెట్టుకోవాలి.కానీ మన సినిమా షూటింగ్ ఆలస్యం అవ్వడంతో పాటు పబ్లిసిటీ కార్యక్రమాలు చేయని కారణంగా అక్కడ విడుదల వాయిదా వేశామని అంటున్నారు.







