తెలంగాణ సీఎం కేసీఆర్ పై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.తెలంగాణలో పాలనను గాలికి వదిలేశారని మండిపడ్డారు.
పార్టీ పేరుతో కేంద్రాన్ని నిందించడమే పనిగా పెట్టుకున్నారని అన్నారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ కొంటామని సింగరేణి డైరెక్టర్లను అక్కడకి పంపించి అనేక ప్రకటనలు చేశారన్నారు.
సింగరేణిని కేంద్రం ప్రైవేట్ పరం చేస్తుందంటూ నిరసనలు చేపట్టారన్న కిషన్ రెడ్డి తెలంగాణలో అనేక పరిశ్రమలు మూతపడ్డాయని విమర్శించారు.వందరోజుల్లో నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తామని హమీ ఇచ్చిన కేసీఆర్ తొమ్మిదేళ్లు గడుస్తున్నా ఏం చేయలేకపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇటువంటి వ్యక్తి కేసీఆర్ కు స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడే కనీస నైతిక హక్కు లేదని ధ్వజమెత్తారు.







