మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ దర్యాప్తు వేగవంతంగా కొనసాగుతోంది.ఇందులో భాగంగా ఇవాళ తెల్లవారుజామున వైఎస్ భాస్కర్ రెడ్డిని సీబీఐ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
వైఎస్ భాస్కర్ రెడ్డిని అధికారులు హైదరాబాద్ సీబీఐ కోర్టుకు తరలిస్తున్నారు.కడప, ఆళ్లగడ్డ, నంద్యాల, కర్నూలు మీదుగా హైదరాబాద్ కు తీసుకువస్తున్నారు.
కాగా సెక్షన్ 120బి, రెడ్ విత్ 302, 201 కింద కేసులు నమోదు చేశారు.ఈ క్రమంలోనే వైఎస్ భాస్కర్ రెడ్డి భార్య వైఎస్ లక్ష్మీకి అరెస్ట్ సమాచారం జారీ చేశారని తెలుస్తోంది.
అదేవిధంగా భాస్కర్ రెడ్డిని సీబీఐ సాయంత్రం జడ్జి ముందు ప్రవేశపెట్టనుంది.







