ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలకు( Assembly elections ) మరో ఏడాది సమయం ఉంది.అయినా కూడా ఇప్పటి నుండే రాజకీయ వేడి రాజుకుంటుంది.
ప్రముఖ పార్టీలన్నీ కూడా వచ్చే నెలలోనే ఎన్నికలు ఉన్నాయి అన్నంతగా హడావుడి చేస్తున్నాయి.తాజాగా బీజేపీ నాయకుడు ఎంపీ సీఎం రమేష్( MP CM Ramesh ) చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా నిలిచాయి.
గత కొంత కాలంగా ఏపీలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీ కి స్పష్టమైన ఆదిత్యం రాదు అనే అభిప్రాయాన్ని కొందరు వ్యక్తం చేస్తున్నారు.

అదే కనుక నిజమైతే హంగ్ ప్రభుత్వం( Hung Govt ) ఏర్పాటు అయ్యే అవకాశాలు ఉన్నాయి.ఏపీ లో హంగ్ ఏర్పడితే పరిస్థితి ఏంటి అంటూ ఇప్పటికే ఒక వర్గం రాజకీయ నాయకులు చర్చించుకుంటున్నారు.తాజాగా సీఎం రమేష్ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం ఏర్పడబోతుందంటూ.
వచ్చేది సంకీర్ణ ప్రభుత్వం అంటూ చేసిన వ్యాఖ్యలతో మరింతగా సస్పెన్స్ నెలకొంది.

ఒక వేళ నిజంగానే హంగ్ ఏర్పడితే ఏ ఏ పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయి అనే విషయం లో స్పష్టత రావాల్సి ఉంది.గత కొంత కాలంగా బిజెపి మరియు జనసేన పార్టీ అధికారం కోసం అంటూ పొత్తులో ఉన్నాయి.ఈ రెండు పార్టీలతో కలిసి వచ్చే ఎన్నికల్లో ముందుకు వెళ్లాలని తెలుగు దేశం పార్టీ కూడా భావిస్తుంది.
కానీ బిజెపి మాత్రం తెలుగు దేశం పార్టీని రానిచ్చే పరిస్థితి లేదు.ఈ సమయం లో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నిర్ణయం ఏంటీ అనేది అంతా ఆసక్తిగా మారింది.
తెలుగు దేశం పార్టీ మరియు జనసేన కలిసి ముందుకు వెళ్తే కచ్చితంగా వైకాపా కి కష్టాలు తప్పవు అంటూ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం చేస్తున్నారు.ఏం జరుగుతుందో చూడాలి అంటే మరి కొన్ని నెలలు వెయిట్ చేయాల్సిందే.







