బోల్ట్ ఆడియో కంపెనీ తాజాగా రోవర్ ప్రో( Boult Rover Pro ) అనే కొత్త స్మార్ట్‌వాచ్‌ను విడుదల చేసింది.ఇది అమోలెడ్ డిస్ప్లే, సింగిల్-చిప్ బ్లూటూత్ కాలింగ్ వంటి మరిన్ని ఫీచర్లు ఆఫర్ చేస్తుంది.ఇందులో 1.43-అంగుళాల అమోలెడ్ కర్వ్డ్ రౌండ్ డిస్ప్లే ఉంటుంది.అలానే ఇది 150కి పైగా వాచ్ ఫేస్‌లు, 1000 నిట్స్ బ్రైట్నెస్, 446×446 పిక్సెల్‌ల రిజల్యూషన్‌ను కలిగి ఉంది.Rover Pro సింగిల్-చిప్-ఆధారిత బ్లూటూత్ కాలింగ్ బ్లూటూత్ వెర్షన్ 5.2ని ఉపయోగిస్తుంది.ఈ ఫీచర్ 10 మీటర్ల పరిధిలోని డివైజ్లతో ఒకే ఒక-క్లిక్‌తో కనెక్ట్ అవుతుంది.
మీరు బ్లూటూత్ ఫీచర్‌తో కాల్లు లిఫ్ట్ చేయవచ్చు, రిజెక్ట్ చేయవచ్చు.SMS మెసేజెస్ పంపవచ్చు.
డయల్ ప్యాడ్‌ని యాక్సెస్ చేయవచ్చు.కాంటాక్ట్స్ సింక్ చేసుకోవచ్చు.
ఈ సరికొత్త బోల్ట్ రోవర్ ప్రో వాచ్‌లో బ్లడ్ ప్రెజర్ మానిటర్, హార్ట్ రేట్ సెన్సార్, SpO2 సెన్సార్, పీరియడ్, స్లీప్ ట్రాకర్స్ వంటి వివిధ హెల్త్ సెన్సార్లు ఉన్నాయి.అలాగే ఇది సెడెంటరీ, వాటర్ డ్రింకింగ్ రిమైండర్లను పంపుతుంది.వాచ్‌లో క్రికెట్, రన్నింగ్, సైక్లింగ్, బాస్కెట్‌బాల్, యోగాతో సహా 100కి పైగా స్పోర్ట్స్ మోడ్లు కూడా ఉన్నాయి.ఈ వాచ్ లాంగ్ బ్యాటరీ లైఫ్‌ను కలిగి ఉంది.
ఒక్కసారి ఛార్జ్ చేస్తే 10 రోజుల వరకు ఉంటుంది.ఫాస్ట్ ఛార్జింగ్‌కు( Fast Charging ) మద్దతు ఇస్తుంది.
వాచ్ USB టైప్-సి పోర్ట్ ద్వారా 10 నిమిషాల పాటు ఛార్జ్‌తో 2-రోజుల ఛార్జ్‌ను అందిస్తుంది.
బౌల్ట్ ఆడియో రోవర్ ప్రో( Boult Rover Pro Smart Watch ) మరిన్ని ఫీచర్ల గురించి తెలుసుకుంటే, ఇందులో క్యూఆర్ కోడ్ స్కానింగ్, SOS ఫంక్షనాలిటీ, 4-అంకెల పిన్, గూగుల్ అసిస్టెంట్ లేదా సిరికి యాక్సెస్ ఉంటుంది.దీనిలో ఫైండ్ మై ఫోన్ ఫీచర్, స్మార్ట్ నోటిఫికేషన్లు, మ్యూజిక్ కంట్రోల్స్ వంటి మరిన్ని ఫీచర్లు కూడా ఉన్నాయి.దీనికి IP68 రేటింగ్ కూడా ఉంది.
రోవర్ ప్రో రెగల్, ఐకాన్ రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది.స్మార్ట్ వాచ్ ధర రూ.2,499గా కంపెనీ నిర్ణయించింది.ఫ్లిప్‌కార్ట్, కంపెనీ వెబ్సైట్ ద్వారా దీన్ని సొంతం చేసుకోవచ్చు.
వాచ్‌లో రెండు అదనపు పట్టీలు కూడా ఉచితంగా లభిస్తాయి.