14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేశానని చెప్పుకుంటున్న నువ్వు గుడివాడకు ఏం చేశావు ? నిమ్మకూరుకు ఏం చేశావు అంటూ టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుపై గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని ఫైర్ అయ్యారు.ఎన్టీఆర్ స్వగ్రామం నిమ్మకూరులో టిడిపి అధినేత చంద్రబాబు( Chandrababu ) పర్యటించిన నేపథ్యంలో నాని అనేక అంశాలను ప్రస్తావిస్తూ విమర్శలు చేశారు.
గుడివాడ ఎన్టీఆర్( NTR ) పుట్టిన గడ్డాన్ని చంద్రబాబు ఇప్పుడు దొంగ ప్రేమ చూపిస్తున్నారని, కానీ గుడివాడ నియోజకవర్గంలో ఫ్లై ఓవర్లు, రోడ్లు, పేదలకు ఇళ్లు కడుతూ అభివృద్ధి చేస్తున్నాం.నిమ్మకూరు వెళ్తే చంద్రబాబు ఉండడానికి ఎవరు ఇల్లు కూడా ఇవ్వలేదు .అందుకే బస్సులో చంద్రబాబు పడుకున్నాడు అంటూ నాని విమర్శలు చేశారు.పెళ్లయిన 42 ఏళ్లకు అత్తగారు ఇంటికి వెళ్లి పడుకున్న చంద్రబాబుకు అసలు సిగ్గుందా అంటూ నాని మండిపడ్డారు.

అసలు నిమ్మకూరులో ఎన్టీఆర్ దంపతుల విగ్రహాలను కట్టించింది చంద్రబాబు కాదని, తాను, జూనియర్ ఎన్టీఆర్ 60 లక్షలు పెట్టి 2003లో ఎన్టీఆర్ దంపతుల విగ్రహాలు ఏర్పాటు చేసినమని నాని చెప్పారు.అంతేకాదు నిమ్మకూరు పై ప్రేమ ఉన్నది పెద్ద ఎన్టీఆర్, హరికృష్ణ , జూనియర్ ఎన్టీఆర్ కు మాత్రమేనని, నిమ్మకూరులో జూనియర్ ఎన్టీఆర్ కు తప్ప , ఎవరికి ఆస్తులు లేవని కొడాలి నాని( Kodali Nani ) అన్నారు.ఎన్టీఆర్ పుట్టిన గడ్డ గుడివాడ అని చంద్రబాబు ఇప్పుడు దొంగ ప్రేమ చూపిస్తున్నాడంటూ నాని ఆగ్రహం వ్యక్తం చేశారు .

ఇదిలా ఉంటే.నిన్న నిమ్మకూరులో పర్యటించిన చంద్రబాబు తెలుగుజాతి కోసం ఎన్టీఆర్ తెలుగుదేశాన్ని స్థాపించారని, తెలుగు భాష పై మక్కువతో తెలుగు జాతి పై అభిమానంతో గొప్ప నిర్ణయాలు తీసుకున్నారని, ఆయన బాటలోనే టిడిపిని ముందుకు తీసుకు వెళ్తున్నామని అన్నారు.ముందు చూపుతో సాంకేతిక పరిజ్ఞానానికి బాటలు వేసామని, ఎన్టీఆర్ గారి పేరుతో ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్టును ఆయన కుమార్తె భువనేశ్వరి నిర్వహిస్తున్నారని, బాలకృష్ణ బసవతారకం ఆసుపత్రి నిర్వహణ చూస్తున్నారని, ఆయన పుట్టిన నిమ్మకూరుకి అవసరమైన అన్ని పనులు చేశామని , ఈ గ్రామాన్ని లోకేష్ దత్తత తీసుకుని అభివృద్ధి చేశారని చంద్రబాబు చెప్పుకొచ్చారు .ఈ అంశాలపైనే కొడాలి నాని తాజాగా మీడియా సమావేశం నిర్వహించి తనదైన శైలిలో చంద్రబాబుపై విమర్శ చేశారు.







