మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఢిల్లీకి వెళ్లారు.ఈ మేరకు ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గేను కలిసేందుకు అపాయింట్మెంట్ కోసం ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది.
అయితే, టీపీసీసీ తనకు షోకాజ్ నోటీసులు ఇవ్వడంపై మహేశ్వర్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే ఖర్గేతో మాట్లాడిన తరువాత తన నిర్ణయం ప్రకటిస్తానని మహేశ్వర్ రెడ్డి చెబుతానని తెలిపారు.
ఈ నేపథ్యంలోనే ఆయన ఢిల్లికి వెళ్లారు.అయితే పార్టీ మారడం కోసమే మహేశ్వర్ రెడ్డి హస్తినకు వెళ్లారనే ప్రచారం జోరుగా సాగుతోంది.