Kriti Shetty : మాట మార్చేసిన కృతి శెట్టి.. ఇక హీరోయిన్ గా కష్టమేనా?

చాలామంది సందర్భం బట్టి మాట మారుస్తూ ఉంటారు.ముందు ఒక మాట మాట్లాడి ఆ తర్వాత సందర్భం వచ్చి ఆ మాటను మార్చేస్తే ఎవరికైనా సరే కోపం వస్తుంది.

 Kriti Shetty : మాట మార్చేసిన కృతి శెట్�-TeluguStop.com

ఇప్పుడు అటువంటిదే హీరోయిన్ కృతి శెట్టి ( Kriti Shetty )కూడా చేయటంతో ఆమెపై బాగా ఫైర్ అవుతున్నారు జనాలు.ఇంతకు ఆమె ఏ విషయంలో మాట మార్చేసింది.

అసలు ఏం జరిగిందన్న విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ఉప్పెన సినిమా( Uppena movie )లో నటించి తొలిచూపులతోనే కుర్రాళ్ళను ఆకట్టుకుంది కృతి శెట్టి.

ఈ సినిమాతోనే ఓవర్ నైట్ స్టార్ గా మారి స్టార్ హీరోల దృష్టిలో కూడా పడింది.అతి తక్కువ సమయంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకుంది.

కెరీర్ మొదట్లో ఈ ముద్దుగుమ్మ సినీ ఇండస్ట్రీకి బాలనటిగా అడుగుపెట్టింది.ఎక్కువగా బాలీవుడ్ అడ్వర్టైజ్మెంట్లలో చేసి ఆకట్టుకుంది.

ఆ తర్వాత హీరోయిన్ గా అడుగుపెట్టగా హీరోయిన్ గా కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది.తర్వాత వరుసగా అవకాశాలు అందుకుంటూ కొంతవరకు సక్సెస్ లు అందుకుంటుంది.ఇక ప్రస్తుతం వరుస సినిమాలతో బాగా బిజీగా ఉంది.ఇక సోషల్ మీడియాలో మాత్రం నిత్యం ఏదో ఒక పోస్టు తో బాగా హల్ చల్ చేస్తుంది.

ఫోటో షూట్ లంటూ తెగ సందడి చేస్తుంది.నిజానికి ఈమె పాతికేల వయసు కూడా దాటలేదు.

Telugu Bollywood, Kriti Shetty, Tollywood, Uppena-Movie

కానీ ఈమె చేసే పనులు మాత్రం పాతికేళ్లు దాటిన దానిగా ఉంటాయి.ఈ విధంగా ఈమెకు బాగా ట్రోల్స్ ఎదురవుతూ ఉంటాయి.అయినా కూడా అవి పట్టించుకోకుండా తనకు నచ్చినట్లు ప్రవర్తిస్తుంది.పొట్టి పొట్టి బట్టలు వేస్తూ బాగా రచ్చ రచ్చ చేస్తూ ఉంటుంది.తెగ ఫోటో షూట్ లు చేయించుకుంటూ కుర్రాళ్ళ మతి పోగోడుతుంది.అయితే ఇదంతా పక్కన పెడితే తాజాగా ఈమె పై ఫైర్ అవుతున్నారు తెలుగు ప్రేక్షకులు.

Telugu Bollywood, Kriti Shetty, Tollywood, Uppena-Movie

పైగా మాట మార్చేసింది అంటూ ఘోరంగా తిట్టిపోస్తున్నారు.అయితే అసలు విషయం ఏంటంటే.ఆమె నటించిన శ్యామ్ సింగరాయ్ సినిమా మంచి సక్సెస్ అందుకోగా ఇక ఆ సినిమాను హిందీలో రీమేక్ చేయాలని అనుకున్నప్పుడు కృతి శెట్టిని హీరోయిన్ అప్రోచ్ అయ్యారట.దీంతో ఆ విషయాన్ని గతంలో తానే తెలిపింది.

తను ఇక బాలీవుడ్ ఇండస్ట్రీలో చేయనంటూ.టాలీవుడ్ ఇండస్ట్రీ తనకు చాలా ఇచ్చిందంటూ తనకు ఇక్కడి నుంచే లైఫ్ వచ్చిందంటూ.

తన లైఫ్ టాలీవుడ్ కి అంకితం చేస్తున్నానంటూ బాగా డైలాగులు కొట్టింది.తీరా ఇప్పుడు చూస్తే.

బాలీవుడ్ లో అవకాశాల కోసం ప్రయత్నిస్తుందని తెలిసింది.పైగా ఒక సినిమాలో సెకండ్ హీరోయిన్ గా కూడా ఛాన్స్ వచ్చింది అని.కనీసం ఆ సినిమాలు తన పాత్ర అరగంట కూడా లేదని.

Telugu Bollywood, Kriti Shetty, Tollywood, Uppena-Movie

ఆ పాత్ర కోసం ఆమె ఓకే చేయటంతో.

పైగా బాలీవుడ్ లో కూడా అడుగు పెట్టినందుకు ఆమెపై ఫైర్ అవుతున్నారు.ఒకప్పుడు టాలీవుడ్ లో ఉంటానని చెప్పి.

ఇప్పుడు అక్కడ అవకాశం రాగానే సెకండ్ హీరోయిన్ గా కూడా వెళ్లిపోయింది అని.మాట మార్చేసింది అంటూ ఫైర్ అవుతున్నారు.మరికొంతమంది సెకండ్ హీరోయిన్ గా చేస్తే ఆమె కెరీర్ ముగిసినట్లే అని.ఇక హీరోయిన్ గా ఆమెకు అవకాశాలు కూడా రావడం తక్కువే అని అంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube