నాని హీరోగా నటించిన దసరా చిత్రం ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించిన దసరా( Dasara ) చిత్రం కి దర్శకుడు శ్రీకాంత్ ఓదెల.
ఈయన ప్రముఖ దర్శకుడు సుకుమార్ శిష్యుల్లో ఒకడు అనే విషయం చాలా మందికి ముందు తెలియదు.దసరా విడుదల సమయంలో సుకుమార్ మీడియా ముందుకు రాకపోవడంతో శ్రీకాంత్ ఓదెల ఆయన శిష్యుడేనా అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేశారు.

ఈ మధ్య కాలంలో ఒక వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.రంగస్థలం సినిమా సెట్టింగ్ తో పాటు బ్యాక్ గ్రౌండ్ సెట్ వర్క్ మరియు బ్యాక్ గ్రౌండ్ ఆర్టిస్టులందరిని కూడా శ్రీకాంత్ ఓదెల చూసుకున్నాడట.వాటన్నింటిని ఎంతో జాగ్రత్తగా ప్లాన్ చేశాడు కనుకే తన పని ఈజీ అయింది అంటూ రంగ స్థలం సినిమా యొక్క ఈవెంట్ లో దర్శకుడు సుకుమార్( Sukumar ) మాట్లాడుతూ శ్రీకాంత్ ఓదెల గురించి చెప్పుకొచ్చాడు.

అసలు రంగస్థలం సినిమా కు చేయడం వల్లే దసరా సినిమా ను దర్శకుడు శ్రీకాంత్ ఓదెల( Srikanth Odela ) ఇంత అద్భుతంగా రూపొందించాడు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.మొత్తానికి శ్రీకాంత్ ఓదెల గురించి జరిగిన ప్రచారం మరియు ఆయన సినిమా గురించి ఇప్పుడు మీడియాలో హైలైట్ అవుతోంది.శ్రీకాంత్ ఓదెల యొక్క గొప్పతనం గురించి కచ్చితంగా దసరా సినిమా విడుదల అయిన తర్వాత మాత్రమే జనాలు తెలుసుకుంటారు అంటూ నాని దసరా సినిమా యొక్క ప్రమోషన్ ఈవెంట్స్ లో చెప్పుకొచ్చాడు.
అన్నట్లుగానే ఇప్పుడు శ్రీకాంత్ ఓదెల కుమ్మేస్తున్నాడు.వరుసగా స్టార్ హీరోల సినిమా లకు దర్శకత్వం వహించే అవకాశాలు దక్కించుకుంటున్నాడు.దసరా సినిమా యొక్క వసూళ్లు భారీగా నమోదు అవుతున్న కారణంగా శ్రీకాంత్ ఓదెల భారీ క్రేజ్ ను దక్కించుకున్నాడు.







