జ్ఞాపకశక్తి( memory ) తగ్గుతున్నట్లు అనిపిస్తుందా? చిన్న చిన్న విషయాలు కూడా మర్చిపోతున్నారా? అయితే జాగ్రత్త పడండి.అల్జీమర్స్, డిమెన్షియా వంటి ప్రమాదకరమైన వ్యాధులకు ఇది లక్షణం కావచ్చు.
ఈ రోజు చిన్న చిన్న విషయాలు రేపు పెద్దవిగా మారుతుంటాయి.కాబట్టి మెదడు పని తీరును మెరుగుపరుచుకునేందుకు ప్రయత్నించండి.
అయితే అందుకు ఇప్పుడు చెప్పబోయే జ్యూస్ చాలా అద్భుతంగా సహాయపడుతుంది.ఈ జ్యూస్ ను డైట్ లో చేర్చుకుంటే జ్ఞాపకశక్తి రెట్టింపు అవుతుంది.
మరి ఇంకెందుకు ఆలస్యం ఆ జ్యూస్ ను ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.
ముందుగా బ్లెండర్ తీసుకుని అందులో అరకప్పు బీట్ రూట్ ముక్కలు( Beet root pieces ), అర కప్పు క్యారెట్ ముక్కలు, అర కప్పు కీరా దోసకాయ ముక్కలు వేసుకోవాలి.
అలాగే అర కప్పు క్యాబేజీ తరుగు, ఒక ఆరెంజ్ వేసుకుని ఒకటిన్నర గ్లాసుల వాటర్ పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుంచి స్ట్రైనర్ సహాయంతో జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.
ఈ జ్యూస్ లో వన్ టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్, రెండు టేబుల్ స్పూన్ల తేనె వేసుకుని బాగా మిక్స్ చేసి సేవించాలి.ఈ జ్యూస్ ను రెగ్యులర్ డైట్ లో చేర్చుకుంటే అందులో ఉండే పోషకాలు మెదడును చురుగ్గా మారుస్తాయి.దీంతో జ్ఞాపకశక్తి మరియు ఆలోచన శక్తి రెట్టింపు అవుతాయి.ఫలితంగా మెదడు సంబంధిత సమస్యలు వచ్చే రిస్క్ తగ్గుతుంది.
అలాగే ఈ జ్యూస్ ను డైట్ లో చేర్చుకోవడం తో పాటు కంటి నిండా నిద్ర ఉండేలా చూసుకోండి.రోజుకు కనీసం ఏడు గంటల నుంచి ఎనిమిది గంటలు నిద్రించండి.అదే సమయంలో రోజు కనీసం అరగంట అయినా వాకింగ్, రన్నింగ్ లేదా ఇతర వర్కౌట్స్ చేయండి.ఒత్తిడికి దూరంగా ఉండండి.మద్యపానం, ధూమపానం అలవాట్లను మానుకోండి.మరియు రోజు ఏదో ఒక కొత్త విషయాన్ని తెలుసుకునేందుకు ప్రయత్నించండి.
ఇవన్నీ మెదడు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.మెదడు పనితీరును మెరుగు పరుస్తాయి.