మామూలుగా సినీ ఇండస్ట్రీకి చెందిన నటీనటుల మధ్యలో సీక్రెట్ లవ్, డేటింగ్ వంటివి నడుస్తూ ఉంటాయి.ఇక తమ మధ్య ఉన్న వ్యవహారాన్ని ఎంత సీక్రెట్ గా దాచాలన్నా కూడా ఏదో ఒక సందర్భంలో బయటపడుతూ ఉంటారు.
పైగా ఇప్పుడు సోషల్ మీడియా అందుబాటులో ఉండటంతో వాళ్ళు ఏదైనా కెమెరాకి చిక్కితే చాలు వెంటనే సోషల్ మీడియాలలో, సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారుతారు.
ఇక ఇప్పటికే చాలామంది సెలబ్రెటీలు.
సీక్రెట్ గా లవ్ చేసుకొని పెళ్లి చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి.ఇక మరికొంతమంది సీక్రెట్ గానే బ్రేకప్ లు కూడా చెప్పుకున్నారు.
ఇప్పటికీ ఇండస్ట్రీలో రహస్య ప్రేమలు నడుస్తూనే ఉన్నాయి.టాలీవుడ్ ఇండస్ట్రీలో పలువురు హీరోయిన్లు ఇతర హీరోలతో సీక్రెట్ లవ్ నడిపిస్తున్నారు.
కానీ అవి అసలు బయటపడనివ్వటం లేదు.
అందులో ఒకరు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న( Vijay Devarakonda ,Rashmika Mandanna ) జంట.ఇక వీరిద్దరూ కలిసి రెండు సినిమాల్లో కూడా నటించారు.ఆ సమయంలోనే వీరి మధ్య పరిచయం కాస్త స్నేహంగా ఏర్పడి ఆ తర్వాత ప్రేమగా మారిందని తెలిసింది.
ఇప్పటికే వీరిద్దరూ కలిసి ఉన్న సందర్భాలు మీడియా కంటికి చిక్కాయి.కానీ ఎప్పటికప్పుడు వీరిద్దరూ మంచి ఫ్రెండ్స్ అని చెప్పుకుంటూ తిరుగుతున్నారు.

జనాలు మాత్రం వీరిద్దరిని ఫ్రెండ్స్ అంటే ఎవరు నమ్మట్లేరు.పైగా గతంలో ఇద్దరు మాల్దీవులకు( Maldives ) వెళ్లారని ఆ సమయంలో వీరిద్దరూ ఒకే చోట వేరే వేరే వైపు దిగిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో బాగా హల్చల్ చేశాయి.అంతేకాకుండా రష్మిక విజయ్ దేవరకొండ ఫ్యామిలీతో ఫోటోలు కూడా దిగినట్లు అప్పుడు కొన్ని ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి.అలా వీరిద్దరి విషయంలో ప్రతి ఒక్కటి మ్యాచ్ అవ్వటంలో ఇద్దరు నిజంగానే సీక్రెట్ లవ్ లో ఉన్నారు అని బాగా అనుమానాలు పుట్టుక వస్తున్నాయి.

వీళ్ళు ఏదైనా ఇంటర్వ్యూలో పాల్గొన్న కూడా వీరికి ఈ ప్రేమ వ్యవహారం గురించి ప్రశ్నలు ఎదురవుతూనే ఉంటాయి.సోషల్ మీడియాలో కూడా వీరిద్దరిని సీక్రెట్ లవ్ గురించి ప్రశ్నలతో కడిగిపారేస్తూ ఉంటారు నెటిజన్స్.అయితే ఇప్పటివరకు వీరిద్దరి మధ్య ఏదో నడుస్తుందన్న అనుమానాలు మాత్రం గట్టిగానే ఉండగా.నిన్న రష్మిక పుట్టినరోజు( Rashmika’s birthday ) సందర్భంగా విజయ్ దేవరకొండ నుండి ఎటువంటి విషెస్ రాకపోవటంతో కొన్ని అనుమానాలు వస్తున్నాయి.

నిన్న రష్మిక పుట్టినరోజు సందర్భంగా టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన సెలబ్రెటీలంతా ఆమెకు బర్త్డే విషెస్ చేశారు.కానీ విజయ్ దేవరకొండ మాత్రం ట్విట్టర్ లో గాని, అటు ఇన్స్టాగ్రామ్ లో కానీ తనకు విష్ చేయలేదు.అంతేకాకుండా స్టోరీ రూపంలో తనకు వచ్చిన విషెస్ అన్ని రీ స్టోరీ చేసింది రష్మిక.అందులో కూడా ఎక్కడ తనకు విజయ్ దేవరకొండ విష్ చేసినట్లు కనిపించలేదు.
దీంతో విజయ్ దేవరకొండ రష్మికను దూరం పెట్టాడా అని కొందరు అనుమానాలు పడుతున్నారు.మరికొందరు ఆయన ప్రత్యేకంగా ఎటువంటి స్టోరీ పెట్టకపోవడంతోనే వీరిద్దరి మధ్య నిజంగా లవ్ నడుస్తుంది అని కొందరు మరోలా ఆలోచిస్తున్నారు.
మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియాల్సి ఉంది.







