తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి వరుస పెట్టి ప్రశ్నాపత్రాల లీక్ ఘటనలు చెడ్డ పేరుని తీసుకొస్తున్నాయి.TSPSC ప్రశ్నాపత్రం లీక్ గొడవ మరువకముందే నిన్న పదో తరగతి తెలుగు ప్రశ్నపత్రం లీక్ అయింది.
ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముగ్గురు అధికారులపై బదిలీ వేటు కూడా వేయడం జరిగింది.వికారాబాద్ జిల్లా( vikarabad )లో ఈ ఘటన చోటుచేసుకుంది.
పరిస్థితి ఇలా ఉంటే నేడు వరంగల్ జిల్లాలో పదవ తరగతి హింది ప్రశ్న( Hindi Paper Leak ) పత్రం బయటకు రావటం సంచలనంగా మారింది.పరీక్ష ప్రారంభమైన కొద్దిసేపటికే వాట్సాప్ గ్రూప్ లలో హిందీ పేపర్ సర్క్యూలేట్ కావటం జరిగింది.
నిన్న వాట్సాప్ గ్రూప్ లో తెలుగు పేపర్( TELUGU question paper ) కూడా ఈరకంగానే సర్కులేట్ అయింది.వరుసగా రెండో రోజు పదవ తరగతి పరీక్ష పేపర్ బయటకు రావడంపై విద్యార్థులు మరియు తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.
మరి ఈ ఘటనపై ప్రభుత్వం ఏ రకంగా యాక్షన్ తీసుకుంటుంది అనేది ఆసక్తికరంగా మారింది.ఈ పరిణామంతో ముందస్తు జాగ్రత్తగా నాంపల్లి SSC బోర్డు కార్యాలయం దగ్గర.
భారీ భద్రత పెంచటం జరిగింది.తెలంగాణలో వరుసగా ప్రశ్నాపత్రాల లీకేజ్ ఘటనలు ప్రభుత్వానికి ఇప్పుడు పెద్ద తలనొప్పిగా మారాయి.