కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పరువు నష్టం కేసులో ఇవాళ సూరత్ కోర్టును ఆశ్రయించనున్నారు.ఈ మేరకు స్వయంగా ఆయనే స్వయంగా కోర్టుకు హాజరై కింది కోర్టు తీర్పుపై స్టే ఇవ్వాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేయనున్నారు.
ముందు సోనియా గాంధీతో రాహుల్ గాంధీ భేటీ అయ్యారు.ఈ నేపథ్యంలో రాహుల్ ఆయన సోదరి ప్రియాంక, ఇతర ముఖ్యనేతలతో కలిసి సూరత్ కోర్టుకు వెళ్లనున్నారు.
కాగా మార్చి 23న రాహుల్ గాంధీకి న్యాయస్థానం శిక్ష విధించిన సంగతి తెలిసిందే.దీంతో ఆయనపై లోక్ సభ సభ్యత్వంపై అనర్హత వేటు పడిన సంగతి తెలిసిందే.







