క్రికెట్ అభిమానులు ఎంతటెంతటాని ఎదురు చూస్తున్న టాటా ఐపీఎల్ 2023( Tata IPL 2023 ) గుజరాత్ లోని నరేంద్రమోడీ స్టేడియం( Narendra Modi Stadium )లో అట్టహాసంగా మొదలయ్యింది.ఈ ఐపీఎల్ ప్రారంభ వేడుకలు మూడు సంవత్సరాల తర్వాత అంగరంగ వైభవంగా నిర్వహించినట్టు తెలుస్తోంది.
చెన్నై సూపర్ కింగ్స్( Chennai Super Kings ) జట్టు మొదటి ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత దాదాపు 1,500 డ్రోన్‌లను ఉపయోగించి జరిగిన లైట్ షో క్రికెట్ అభిమానులను ఆశ్చర్య చకితుల్ని చేసిందని చెప్పుకోవాలి.కాగా దీనికి సంబంధించిన వీడియోను ఐపీఎల్ ట్విట్టర్‌లో పోస్ట్ చేయగా అది కాస్త వైరల్ అవుతోంది.
ఇక ఈ వీడియోను క్రికెట్ అభిమానులు అయిదు షేర్ల మీద షేర్స్ చేస్తూ.మరింత వైరల్ ఎలా చేస్తున్నారు.అంతేకాకుండా తమ అభిప్రాయాలను కామెంట్లరూపంలో తెలియజేస్తున్నారు.కాగా దీనికి భారీ సంఖ్యలో ఇండియన్ సినిమా సెలిబ్రిటీలు రావడం కొసమెరుపు.తమన్నా భాటియా, రష్మిక మంధాన మరియు సింగింగ్ సెన్సేషన్ అరిజిత్ సింగ్ వంటి పెద్ద భారతీయ సూపర్ స్టార్‌లు తమ ప్రదర్శనలతో ఈవెంట్‌ను ఉర్రుతలూగించారు.
ఆ తరువాత ఐ పి యల్ 2023, 16 ఎడిషన్ అధికారికంగా ప్రారంభించబడింది.మొదట బీసీసీఐ అధ్యక్షుడు అయినటువంటి రోజర్ బిన్నీ మరియు బీసీసీఐ గౌరవ కార్యదర్శి జే షా చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్, MS ధోని మరియు గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాతో కలిసి వేదికపైకి రావడం జరిగింది.ఇరువురు కెప్టెన్‌లు ప్రేక్షకుల నుండి పెద్ద ఎత్తున ఆనందోత్సాహాల మధ్య ఐ పి యల్ 2023 ట్రోఫీతో మీడియా ఫోటోలకు ఫోజులు ఇవ్వడం జరిగింది.
కాగా ప్రారంభ వేడుక మొన్న సాయంత్రం 6 గంటలకు ప్రారంభం కాగా ఆ తర్వాత 7 గంటలకు మొదటి మ్యాచ్‌కు టాస్ వేయబడింది.ఈ సీజన్‌లో గుజరాత్ టైటాన్స్ డిఫెండింగ్ ఛాంపియన్‌గా ఉండగా, చెన్నై సూపర్ కింగ్స్ 4 సార్లు విజేతగా నిలిచిన సంగతి విదితమే.