ప్రముఖ వ్యాపార వేత్త, మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా( Anand Mahindra ) గురించి జనాలకి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు.సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్‌గా వుండే ఆనంద్ మహీంద్రా అంటే నేటి యువ తరానికి ఎంతో ఆదర్శం.
తరచూ అనేక స్పూర్తిదాయకమైన పోస్ట్‌లు పెడుతూ జనాలలో జోష్ నింపుతూ వుంటారు ఆనంద్ మహీంద్రా.ఈ క్రమంలో పలు సందర్భాల్లో నెటిజన్లు వేసిన ప్రశ్నలకు తనదైన శైలిలో బదులిస్తుంటారు.
మరీ ముఖ్యంగా ఇన్నోవేటివ్ ఐడియాలు ( Innovative ideas )ఎవరు చేసినా తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా వారిని ప్రోత్సహిస్తారు.
తాజాగా ఆయన ఓ వీడియోను ట్విట్టర్ లో పోస్ట్ చేయగా ఆ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.వైరల్ అవుతున్న వీడియోని ఒకసారి గమనిస్తే….టీ20 మ్యాచ్ లో బౌండరీ లైన్ చివరిలో బంతిని ఆపేందుకు మహిళా క్రికెటర్( female cricketer ) చేసిన ప్రయత్నం అందులో స్పష్టంగా చూడవచ్చు.బంతి వెంట బౌండరీ దాకా పరిగెత్తిన ఆమె.ఫోర్ వెళ్లకుండా ఆపేందుకు చేసిన విన్యాసం నిజంగా అద్భుతంగా అనిపిస్తుంది.అదే విషయం ఇపుడు మహీంద్రాని అబ్బురపరిచింది.
ఇంకేముంది.కట్ చేస్తే ఆ వీడియో ఇపుడు ఆనంద్ మహీంద్రా ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ అయింది.ఈ వీడియోను ట్వీట్ చేస్తూ ఆయన.“మీరు బరిలో దిగినప్పుడు మీ దగ్గర ఉన్న ఎఫర్ట్ అంతా పెట్టండి.ఎందుకంటే ఇక్కడ సగం సగం చర్యలు సరిపోవు” అని క్యాప్షన్ పెట్టారు.
నిబద్ధతతో, పూర్తి ఎఫర్ట్ తో ప్రయత్నించాలని పరోక్షంగా ఆయన మెసేజ్ చెబుతోంది.‘ఫ్రైడే ఫీలింగ్’ అనే హాష్ ట్యాగ్ ను కూడా దానికి జత చేయడం విశేషం.
కాగా ఈ పోస్ట్ ఇపుడు నెటిజన్లను తెగ మెప్పిస్తోంది.మరెందుకాలస్యం మీరు కూడా మహీంద్రా మెచ్చిన ఆ స్ఫూర్తిదాయక వీడియోను చూసేయండి మరి.