'టైగర్ నాగేశ్వరరావు' రిలీజ్ డేట్ ఫిక్స్.. మాస్ రాజా రాబోయేది ఎప్పుడంటే ?

మాస్ మహారాజా రవితేజ (Ravi Teja) స్పీడ్ ను ఏ హీరో కూడా తట్టుకోలేడు.ఈయన వరుసగా నాలుగైదు సినిమాలు ప్రకటిస్తూ వాటిని ఒకదాని వెంట ఒకటి పూర్తి చేస్తూ జెట్ స్పీడ్ తో దూసుకు పోతుంటాడు.

 Ravi Teja's Tiger Nageswara Rao Gets Release Date, Ravi Teja, Pan India Movie, T-TeluguStop.com

మరి ఈ స్పీడ్ ను రవితేజలో చాలా రోజుల తర్వాత చూస్తున్నాం అనే చెప్పాలి.ఎందుకంటే వరుస ప్లాప్స్ వస్తున్న క్రమంలో కాస్త స్పీడ్ తగ్గించగా.

మళ్ళీ చాలా ఏళ్ల తర్వాత రవితేజలో స్పీడ్ కనిపిస్తుంది.

ఈ మధ్య వరుసగా రెండు సూపర్ హిట్స్ అందుకుని ఫుల్ ఫామ్ లోకి వచ్చాడు మాస్ రాజా.

ధమాకా, వాల్తేరు వీరయ్య వంటి రెండు సూపర్ హిట్స్ అందుకున్నాడు.ఇక ఈ రెండు సినిమాల తర్వాత రవితేజ ఇక తన లైనప్ లో ఉన్న సినిమాల షూటింగులను పూర్తి చేస్తున్నాడు.

ప్రెజెంట్ రవితేజ లైనప్ లో ఉన్న చిత్రాల్లో ముందుగా రిలీజ్ కాబోతున్న సినిమా ”రావణాసుర”(Ravanasura).

సుధీర్ వర్మ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 7న రిలీజ్ కాబోతుంది.ఈ సినిమాతో హ్యాట్రిక్ హిట్ కొట్టాలను కసిగా ఉన్నాడు.మరి ఇది రిలీజ్ కు రెడీగా ఉంచి ఇప్పుడు మాస్ రాజా తన కెరీర్ లోనే మొదటి పాన్ ఇండియన్ మూవీ షూట్ లో బిజీగా ఉన్నాడు.

రవితేజ కెరీర్ లో భారీ పాన్ ఇండియా సినిమా ‘టైగర్ నాగేశ్వరరావు’(Tiger Nageswara Rao).డైరెక్టర్ వంశీ తెరకెక్కిస్తున్న ఈ సినిమా ముందు నుండి భారీ అంచనాలను క్రియేట్ చేసుకుంది.

ఇక తాజాగా ఈ రోజు ఈ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ చేసారు.ఈ సినిమాను వరల్డ్ వైడ్ గా అక్టోబర్ 20న గ్రాండ్ గా రిలీజ్ (Tiger Nageswara Rao Release Date) చేయనున్నట్టు మేకర్స్ అఫిషియల్ అనౌన్స్ మెంట్ చేసారు.దీంతో ఈ ఏడాది ముచ్చటగా మూడవ సినిమా మాస్ రాజా నుండి రానుంది.ఇక ఈ సినిమాకు జివి ప్రకాష్ సంగీతం అందిస్తుండగా.అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ వారు నిర్మిస్తున్నారు.ఈ సినిమా కోసం రవితేజ భారీ కసరత్తులు కూడా స్టార్ట్ చేసాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube