పాన్ ఇండియా స్టార్ ప్రభాస్( Prabhas ) చేస్తున్న సినిమాల అప్డేట్ల కోసం ఫ్యాన్స్ ఎంతగా ఎదురు చూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఈయన చేతిలో ఇన్ని సినిమాలు ఉన్న కూడా ఒక్క అప్డేట్ కూడా లేకపోవడంతో ఫ్యాన్స్ నిరాశ వ్యక్తం చేస్తున్నారు.
అప్పుడప్పుడు అప్డేట్స్ వస్తున్నప్పటికీ ఫ్యాన్స్ కు కిక్ ఇచ్చే అప్డేట్స్ మాత్రం అందడం లేదు అనే చెప్పాలి.అందుకే ఎప్పుడెప్పుడు డార్లింగ్ సినిమా నుండి అప్డేట్ వస్తుందా అని ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్.
మరి తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం రేపు ప్రభాస్ ”ఆదిపురుష్( Adipurush ) సినిమా నుండి అప్డేట్ పక్కా అంటూ ఒక వార్త నెట్టింట వైరల్ అవుతుంది.ఆదిపురుష్ సినిమా ప్రకటించినప్పటి నుండి ఎన్నో అంచనాలు ఏర్పడ్డాయి.
ఇతిహాస గ్రంధం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాను బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కించాడు.
రామాయణం ఆధారంగా తెరకెక్కించిన ఈ సినిమా కోసం బాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ టి సిరీస్ సంస్థ దాదాపు 500 కోట్ల పెట్టుబడి పెట్టినట్టు సమాచారం.
ఈ సినిమాలో ప్రభాస్ రాముడి నటిస్తుంటే బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ సీతగా( Kriti Sanon ) నటించింది.అలాగే సైఫ్ అలీ ఖాన్ రావణాసురిడిగా నటిస్తుండగా.
సన్నీ సింగ్ లక్షణుడిగా నటిస్తున్నాడు.

ఈ సినిమా విషయంలో ముందు నుండి మంచి అంచనాలు ఉన్నాయి.మరి అంచనాలు పీక్స్ లో ఉన్న సమయం లోనే టీజర్ వచ్చి ఈ సినిమాపై ఆడియెన్స్ లో నిరాశ కలిగేలా చేసింది.మరి ఫ్యాన్స్ నుండి నెగిటివ్ కామెంట్స్ రావడంతో ఈ సినిమాను మేకర్స్ వాయిదా వేసి మరోసారి మార్పులు చేర్పులు చేయడంలో బిజీగా ఉన్నారు.
అలాగే ఈ సినిమా రిలీజ్ ను జనవరి నుండి జూన్ 16కు వాయిదా వేశారు.

ఇదిలా ఉండగా తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా నుండి రేపు పక్కాగా అప్డేట్ రాబోతున్నట్టు సమాచారం.రేపు శ్రీరామనవమి సందర్భంగా ఈ సినిమా నుండి అప్డేట్ ఇయ్యనున్నారట.మరి ఎలాంటి అప్డేట్ ఇస్తారా అని ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు.
అంతేకాదు ఈ సినిమా ప్రమోషన్స్ కూడా శ్రీరామనవమి రోజు నుండి స్టార్ట్ చేయనున్నట్టుగా తెలుస్తుంది.అదిరే ట్రీట్ తో స్టార్ట్ చేస్తారని టాక్ రావడంతో ఫ్యాన్స్ కళ్ళు కాయలు కాచేలా చూస్తున్నారు.







