Naga Chaitanya : ఆ హీరోయిన్ తో డిన్నర్ కు వెళ్లిన నాగచైతన్య.. ప్రేమాయణం నిజమేనంటూ?

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన నాగచైతన్య( Naga Chaitanya ) గతేడాది వరుసగా సినిమాలు ఫ్లాప్ కావడంతో ప్రస్తుతం కథల ఎంపికలో రూటు మార్చారు.కస్టడీ సినిమాతో ఈ ఏడాదే నాగచైతన్య ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

 Nagachaitanya Shobhitha Photo Goes Viral In Social Media Details Here-TeluguStop.com

మే నెలలో విడుదల కానున్న ఈ సినిమా నాగచైతన్య, కృతిశెట్టి( Kriti Shetty ) కెరీర్ ను డిసైడ్ చేయనుంది.మరోవైపు నాగచైతన్య తాజాగా కొత్తింట్లో గృహ ప్రవేశం చేసిన సంగతి సంగతి తెలిసిందే.

చైతన్య గృహ ప్రవేశానికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అయ్యాయి.

మరోవైపు నాగచైతన్య శోభిత( Sobhita ) మధ్య ఏదో ఉందని ఎన్నో వార్తలు ప్రచారంలోకి వచ్చాయనే సంగతి తెలిసిందే.

ఆ వార్తలు నిజమని ప్రూవ్ చేసేలా తాజాగా మరో ఫోటో వెలుగులోకి వచ్చింది.శోభితతో నాగచైతన్య డిన్నర్ కు వెళ్లగా అందుకు సంబంధించిన ఫోటో ఒకటి ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది.

ఈ ఫోటోను చూసిన నెటిజన్లు ఒకింత ఆశ్చర్యానికి గురవుతున్నారు.శోభితతో రిలేషన్ ను చైతన్య బయటపెడితే బాగుంటుందని వాళ్లు కామెంట్లు చేస్తున్నారు.

హీరోయిన్ తో చైతన్య ప్రేమాయణం నిజమేనంటూ వస్తున్న వార్తలపై భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి.చైతన్య నటుడిగా కొత్త జీవితాన్ని ఆరంభించాల్సిన తరుణం ఆసన్నమైందని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.శోభిత మాత్రం చైతన్యతో తనకేం సంబంధం లేదనే విధంగా వ్యవహరిస్తున్నారు.వైరల్ అవుతున్న ఫోటో లండన్ లో దిగిన ఫోటో అని సమాచారం.

లండన్ లోని జమావార్ హోటల్ లో ఈ ఫోటో తీశారని బోగట్టా.ప్రముఖ చెఫ్ సురేంద్ర మోహన్( Surendra Mohan ) సోషల్ మీడియాలో ఈ ఫోటోను షేర్ చేయగా ఈ ఫోటో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.నాగచైతన్య మాత్రం వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలపై నోరు మెదపడానికి ఇష్టపడటం లేదు.చైతన్య కొత్త ప్రాజెక్ట్ లకు సంబంధించిన ప్రకటనలు వెలువడాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube