మెగా పవర్ స్టార్ రామ్ చరణ్( Ramcharan ) నేడు (మార్చ్ 27) పుట్టినరోజును జరుపుకుంటున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున మెగా అభిమానులు కొద్దిరోజుల ముందు నుంచి పెద్ద ఎత్తున పుట్టినరోజు వేడుకలను సెలబ్రేట్ చేస్తున్నారు.ఈ క్రమంలోనే మెగా అభిమానులు రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా భారీ ఈవెంట్ నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో భాగంగా నాగబాబు ( Nagababu )తో పాటు పలువురు జనసేన నాయకులు కార్యకర్తలు సైతం పెద్ద ఎత్తున పాల్గొన్నారు.తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం సరికొత్త ట్రెండ్ నడుస్తున్న విషయం తెలిసిందే.
సాధారణంగా ఏ హీరో పుట్టినరోజు వస్తున్నా ఆ హీరోల సినిమాలను తిరిగి విడుదల చేయడం జరుగుతుంది.
ఈ క్రమంలోనే రామ్ చరణ్ నేడు పుట్టినరోజు జరుపుకుంటున్న నేపథ్యంలో ఒకరోజు ముందుగా రామ్ చరణ్ కెరియర్లో బిగ్గెస్ట్ ఫ్లాప్ అయినటువంటి ఆరెంజ్( Orange ) సినిమాను తిరిగి విడుదల చేశారు. నాగబాబు నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో భారీ నష్టాలను ఎదుర్కొంది.అయితే రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా తిరిగి ఈ సినిమాని విడుదల చేశారు.
ఇప్పుడు మాత్రం ఈ సినిమా భారీ స్థాయిలో కలెక్షన్లను రాబడుతూ అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది.
ఇక మెగా ఫాన్స్ నిర్వహించిన ఈవెంట్ కు ముఖ్య అతిథిగా పాల్గొన్నటువంటి నాగబాబు ఆరెంజ్ సినిమా గురించి మాట్లాడుతూ పలు విషయాలను తెలియజేశారు…ఆరెంజ్ సినిమా అప్పట్లో తనకు భారీ దెబ్బ కొట్టిందని అయితే ఇప్పుడు కలెక్షన్లు చూస్తే మాత్రం చాలా ఆశ్చర్యం వేస్తుందని తెలిపారు.ప్రస్తుత జనరేషన్ వారికి ఈ సినిమా చాలా అద్భుతంగా నచ్చిందని తెలిపారు.అయితే ఈ సినిమా విషయంలో ఎక్కడ తప్పు జరిగిందా అని ఆలోచిస్తే ఆ తప్పు ఎక్కడ జరిగిందో ఇప్పుడు అర్థం అవుతుందని తెలిపారు.
ఇప్పుడు రావాల్సిన ఈ సినిమాని ఒక జనరేషన్ ముందుగానే తీశామని, అందువల్లే అప్పుడు భారీ నష్టాలను ఎదుర్కొన్నామని ఈ సందర్భంగా నాగబాబు చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.