మంచు విష్ణు మంచు మనోజ్ గొడవ పడటం ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతోంది.మంచు మనోజ్ సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియో వల్ల విష్ణు, మనోజ్ మధ్య విభేదాలు ఉన్నాయని స్పష్టమైంది.
ప్రముఖ నటుడు, నిర్మాత చిట్టిబాబు విష్ణు మనోజ్( Manoj, Vishnu ) మధ్య గొడవలకు ఆస్తులు కారణమని వార్తలు ప్రచారంలోకి వస్తున్న నేపథ్యంలో ఆ వార్తల గురించి స్పందించి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.
చిట్టిబాబు మాట్లాడుతూ సారథి( Saradhi ) అనే వ్యక్తి మంచు ఫ్యామిలీలో పని చేసే వ్యక్తి అని వాళ్లకు కజిన్ అని చిన్న వివాదం వల్ల గొడవ జరిగిందని తెలిపారు.
ఒక వివాదానికి సంబంధించి సారథి సరిగ్గా సమాధానం చెప్పకపోవడం వల్ల వివాదం పెద్దదైందని ఆయన కామెంట్లు చేశారు.నాలుగు గోడల మధ్య జరగాల్సిన దానిని మనోజ్ సోషల్ మీడియాలో పెట్టడంతో ఈ సమస్య పెద్దదైందని చిట్టిబాబు కామెంట్లు చేశారు.
నేను క్యాజువల్ గా వీడియో పెట్టానని మనోజ్ చెప్పాడని చిట్టిబాబు( Chittibabu ) అన్నారు.ఆస్తుల గొడవలు ఉండవని ఇప్పటికే పంపకాలు పూర్తయ్యాయని చిట్టిబాబు చెప్పుకొచ్చారు.ఇక్కడ విషయం ఏంటంటే మనోజ్ భూమామౌనిక ఇష్టపడి పెళ్లి చేసుకున్నారని వాళ్లకు ఇష్టం ఉంటే ఇతరులకు సమస్య ఏంటని సమస్య ఉన్నా విలువ ఉండదని చిట్టిబాబు తెలిపారు.హడావిడి లేకుండా పెళ్లి చేయాలని అలా చేశారని ఆయన పేర్కొన్నారు.
మనోజ్ పెళ్లిని భూతద్దంలో చూడాల్సిన అవసరం లేదని చిట్టిబాబు చెప్పుకొచ్చారు.విష్ణు సారథి గొడవ పొలీస్ స్టేషన్ వరకు వెళ్లినట్టు జరిగిన ప్రచారంలో నిజం లేదని ఆయన అన్నారు.లక్ష్మీ ప్రసన్న బ్యానర్ వ్యవహరాలను సారథి చూసుకున్నారని చిట్టిబాబు కామెంట్లు చేశారు.చిట్టిబాబు చెప్పిన విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతున్నాయి.