టిపిసిసి పిలుపుమేరకు రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏళ్ల బాల్ రెడ్డి ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద శాంతియుత మౌన దీక్ష కార్యక్రమం చేపట్టడం జరిగింది.ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బాల్ రెడ్డి మాట్లాడుతూ నరేంద్ర మోడీ నియంతృత్వ విధానాన్ని అంతం చేయాలని ప్రజలు ఎదురు చూస్తున్నారని మండిపడ్డారు.
మార్చి 23 ఒక చీకటి దినం అని ఎందుకంటే దేశంలోనే ప్రతిపక్ష పార్టీ నాయకుడైన రాహుల్ గాంధీ ఎప్పుడో 2019లో ఎన్నికల ప్రచారంలో అన్న మాటను తప్పుపడుతూ వేసిన కేసును వాయిదా వేస్తూ చట్టసభకు అర్హత లేని విధంగా చూడాలని చేయాలనే ఉద్దేశంతో రాహుల్ గాంధీ భవిష్యత్తులో ఎన్నికల్లో పోటీ చేయకుండా శిక్ష విధించి భారతీయ జనతా పార్టీ చేసిన కుట్ర నిన్న బహిర్గతమైందన్నారు.
దీనిని దేశ ప్రజలు గుర్తించాలని, అందుకే నేడు మహాత్మా గాంధీ సాక్షిగా ఈ మౌన దీక్ష చేపట్టామని అన్నారు.
ఈదేశంలో నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతుందన్నారు.నరేంద్ర మోడీ, అమిత్ షా ఇద్దరు కలిసి అదానీ, అంబానీ లాంటి బడా వ్యాపార వేత్తలకు ఈ దేశాన్ని అమ్మేస్తున్నారని నరేంద్ర మోడీ నియంతృత్వ ధోరణిని, అప్రజాస్వామిక విధానాన్ని అంతం చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు గజ్జల రాజు, ఎంపీటీసీ గుండెల్లి శ్రీనివాస్ గౌడ్, జిల్లా కార్యదర్శి కోండం రాజిరెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు బుర్ర రాములు గౌడ్, పాక్స్ వైస్ చైర్మన్ మచ్చ రవి,
కొండాపూర్ గ్రామ శాఖ అధ్యక్షులు గాంతరాజు, గూడెం గ్రామ శాఖ అధ్యక్షులు సడిమెల బాలయ్య, నామాపూర్ గ్రామ శాఖ అధ్యక్షులు గన్నె భాను రెడ్డి, సీనియర్ నాయకులు వెలుముల రాంరెడ్డి, ఉచ్చిడి బాల్ రెడ్డి,ఆరుట్ల మహేష్ రెడ్డి, మాధాసు అనిల్, సత్యానందం, యూత్ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు తాళ్ల విజయ్ రెడ్డి, ఎన్ ఎస్ యు ఐ మండల అధ్యక్షలు సరుగు రాకేష్,ప్రవీణ్, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.