Kantara 2: కాంతార 2 సినిమా కథ మొదలు.. ప్లాప్ అవుతే పరిస్థితి ఏంటో?

కన్నడ హీరో రిషబ్ శెట్టి( Rishab Shetty ) నటించి, దర్శకత్వం వహించిన సినిమా కాంతార.

( kantara ) గత ఏడాది చిన్న సినిమాగా విడుదలైన ఈ సినిమా దేశవ్యాప్తంగా ఏ రేంజ్ లో సంచలనం సృష్టించిందో మనందరికీ తెలిసిందే.

మొదట కన్నడలో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్న ఈ సినిమా ఆ తర్వాత అన్ని భాషల్లో విడుదల బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీని సృష్టించింది.తెలుగు, హిందీ భాషల్లో అత్యధిక కలెక్షన్లను సాధించింది.

ఇకపోతే కాంతార 2 కోసం కన్నడ ప్రేక్షకులతో పాటు తెలుగు, హిందీ ప్రేక్షకులు సైతం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

కాంతార 2( Kantara 2 ) ఉంటుందని ఇప్పటికే హోంబలే వ్యవస్థాపకుడు విజయ్ గతంలోనే ప్రకటించిన విషయం తెలిసిందే.అయితే కాంతార 2 సినిమా అప్డేట్ కోసం సినిమా కోసం అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.ఇది ఇలా ఉంటే ఉగాది పండుగ సందర్భంగా కాంతార2 కీ సంబంధించిన అదిరిపోయే అప్‌డేట్‌ ని విడుదల చేశారు నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్.

Advertisement

తాజాగా ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ ప్రారంభమైందని తెలిపింది.ఈ మేరకు అభిమానులకు శుభవార్త చెప్పింది.

మన కొత్త ఏడాది ఉగాది పండుగ సందర్భంగా కాంతార రెండో పార్ట్ కి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ ప్రారంభమైందని తెలియజేస్తున్నందుకు సంతోషిస్తున్నాం.ప్రకృతితో మన సంబంధాన్ని ప్రదర్శించే మరో ఆకర్షణీయమైన కథనాన్ని మీ ముందుకు తీసుకురావడానికి మేం ఆతృతగా ఉన్నాం.మరిన్ని అప్‌డేట్‌ ల కోసం వేచి ఉండండి అని రాసుకొచ్చింది హోంభలే సంస్థ.

ఇది ఇలా ఉంటే కాంతార 2 సినిమాపై ఇప్పటికే భారీగా అంచనాలు నెలకొన్నాయి.అయితే ఒకవేళ కాంతార2 సినిమా ఫ్లాప్ అయితే పరిస్థితి ఏంటి అన్న ప్రశ్న కూడా వినిపిస్తోంది.

మరోవైపు అభిమానులు కాంతార పార్ట్ తో పాటు పార్ట్ 2 కూడా హిట్ అవుతుంది అంటూ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 
Advertisement

తాజా వార్తలు