సూర్య కుమార్ యాదవ్( Surya kumar yadav ) అంటే టీ20 ఫార్మాట్లో నెం.1 ప్లేయర్ అని అందరికీ తెలిసిందే.కేవలం ఒక ఫార్మాట్లో రాణిస్తూ మిగతా ఫార్మాట్లలో అట్టర్ ఫ్లాప్ అవుతూ విమర్శలను ఎదుర్కొంటున్నాడు.తాజాగా భారత్- ఆస్ట్రేలియా మధ్య జరిగిన రెండు వన్డే మ్యాచ్ లలో ఒక్క పరుగు చేయకుండా అవుట్ కావడం అభిమానులను నిరాశపరిచింది.
శ్రేయస్ అయ్యర్ గాయం ద్వారా వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకోవడంలో సూర్య కుమార్ యాదవ్ విఫలం అయ్యాడు.సూర్య కుమార్ యాదవ్ బ్యాటింగ్ పై మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్( Sunil gavaskar ) కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
సూర్య కుమార్ యాదవ్ బ్యాటింగ్ లో చిన్నచిన్న టెక్నికల్ సమస్యలు ఉన్నాయని అభిప్రాయపడ్డాడు.
టీ20 ఫార్మాట్లో( T20 ) ఆడేటప్పుడు క్రీజు లో నిలబడే విధానం ఓపెన్ స్టాన్స్ లాగా మిగతా ఫార్మాట్లలో ఆడడం ఉపయోగపడదని తెలిపాడు.బంతి కాలుకు దగ్గరలో పడినప్పుడు బ్యాట్ కిందకు దించకపోతే బంతి స్వింగ్ అయిందంటే కచ్చితంగా ఎల్బీడబ్ల్యూ అనే అవకాశాలు ఉంటాయని సునీల్ గవాస్కర్ తెలిపాడు.ఒకసారి సూర్య బ్యాటింగ్ ఆడే విధానం టీ20 ఫార్మాట్లో, మిగతా ఫార్మాట్ లలో ఇంచుమించు ఒకేలా ఉంది.
ఫార్మాట్ ను బట్టి బ్యాటింగ్ స్టైల్ మారాల్సిందే.
సూర్య కుమార్ యాదవ్ ఇప్పటివరకు 22 వన్డేలు ఆడి కేవలం 43 పరుగులు మాత్రమే చేశాడు.ఇందులో కేవలం రెండు అర్థ సెంచరీలు ఉన్నాయి.అదే టీ20 ఫార్మాట్లో సూర్య బ్యాటింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.48 టీ20 మ్యాచ్ లు ఆడిన సూర్య 1675 పరుగులు చేశాడు.ఇందులో మూడు సెంచరీలు, 13 అర్థ సెంచరీలు ఉన్నాయి.సూర్య కుమార్ యాదవ్ బ్యాటింగ్ కోచ్ దగ్గర కొన్ని టెక్నిక్స్ పై అవగాహన తెచ్చుకొని ఈ సమస్యను అధిగమించితే అన్ని ఫార్మాట్ లలో నెం.1 ప్లేయర్ గా భవిష్యత్తులో రాణిస్తాడని, సునీల్ గవాస్కర్ తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచాడు.