ఆస్కార్( Oscar ).ఈ పేరు ఇప్పట్లో తెలుగు వారిని వదిలేలా లేదు.
ఒక్క ఆస్కార్ అవార్డు( Oscar Award ) ఎన్నో మిక్స్డ్ ఫీలింగ్స్ అన్న చందంగా ఆస్కార్ అందుకున్నాక వస్తున్న కథనాలను బట్టి చూస్తే అర్ధం అవుతుంది.ఇక ఆస్కార్ కి సంబందించిన చాల విషయాలు ఇంకా మన వారికి తెలియదు.
ఒక అవార్డు కి ఎంత మంది జ్యురీలు, ఎన్ని ఓట్లు పడాలి లాంటి సాంకేతిక విషయాలు కూడా చాల తక్కువ మందికి తెలుసు.అందుకే అక్కడ పెట్టిన ఖర్చును మాత్రమే చూస్తున్నాం కానీ ఎందుకు పెట్టారు అనే విషయాలను సినిమా ఇండస్ట్రీ నుంచి సాధారణ ప్రేక్షకుల వరకు ఎవరికి నాలెడ్జ్ లేదు.
అందువల్ల ఎవరు నోటికి వచ్చింది వారు మాట్లాడుతున్నారు.

ఇక ఇప్పుడు రాజమౌళి( Rajamouli ) టీమ్ గురించి మరొక ముఖ్యమైన విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.అదేంటంటే ఆస్కార్ అవార్డు ఫంక్షన్ కి ఇక్కడ నుంచి రాజమౌళి, కీరవాణి ( Keeravani )కుటుంబ సభ్యులు మొత్తం తరలి వెళ్లారు.దాదాపు డజన్ కి పైగా ఉన్న ఈ టీమ్ మెంబర్స్ కి వెళ్లడం రావడం, అక్కడ హోటల్ ఖర్చులు బాగానే తడిసి మోపెడు అయ్యాయి.
కానీ ఇంత మందికి ఆస్కార్ ఎలాంటి ఖర్చులు చెల్లించలేదు.కేవలం ఆస్కార్ గెలుచుకున్న కీరవాణి మరియు చంద్ర బోస్ లను, అలాగే పాట పాడిన కాల భైరవ, రాహుల్ సిప్లిగంజ్ కి మాత్రమే ఆహ్వానం ఉందట.
మిగతా వారు అందరు కూడా ఆస్కార్ ఈవెంట్ లోకి వెళ్లాలంటే పే చేయాల్సి వచ్చిందట.

పైగా ఆ అమౌంట్ ఏమైనా తక్కువ ఉంటె పర్లేదు అనుకోవచ్చు.ఒక్కో వ్యక్తికి 20 లక్షల రూపాయలు ఖర్చు తో ఎంట్రీ డబ్బు కట్టి మరి ఈవెంట్ లో పాల్గొనడానికి రాజమౌళి ఖర్చు చేసినట్టు గా తెలుస్తుంది.మూడు నెలల నుంచి అక్కడే ఉండి అవార్డు సాధించడం ఒక ఎత్తు అయితే, ఈ ఈవెంట్ కోసం ఫ్యామిలీ స్టే కోసం కూడా కోట్లలో ఖర్చు అయినట్టుగా తెలుస్తుంది.
కేవలం ఒక అద్భుతమైన మూమెంట్ కి సాక్షులుగా ఉండటం కోసం రాజమౌళి ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది.ఇక రామ్ చరణ్ కుటుంబానికి కూడా ఖర్చు రాజమౌళి పెట్టుకున్నాడట.
ఇప్పటికే రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ తమ మూడు నెలల విలువైన కాలాన్ని అమెరికా లో ఆస్కార్ కోసం వాడేశారు.