Namrata :మహేష్ లేకుండానే వెకేషన్ కు పయనమైన నమ్రత, సితార.. ఫొటోస్ వైరల్?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు( Mahesh babu ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.మహేష్ బాబు ప్రస్తుతం సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే.

 Namarat N Sitara Family Vacation Without Mahesh-TeluguStop.com

ప్రస్తుతం మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తూ బిజీబిజీగా ఉన్నారు.ఈ సినిమా తర్వాత మహేష్ బాబు రాజమౌళి( Rajamouli ) దర్శకత్వంలో రూపొందునున్న సినిమాలో నటించనున్న విషయం తెలిసిందే.

కాగా మహేష్ బాబు కెరియర్ పరంగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ సమయం దొరికినప్పుడల్లా ఫ్యామిలీతో కలిసి వెకేషన్లు తిరుగుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటాడు.

సినిమా షూటింగ్ ఉంటే షూటింగ్లో పాల్గొనడం లేదంటే ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేస్తూ ఉంటారు మహేష్.

ఏడాదిలో కనీసం నాలుగు సార్లు అయినా కుటుంబంతో కలిసి వెకేషన్ కు వెళ్తూ ఉంటాడు.ఇది ఇలా ఉంటే మహేష్ బాబు భార్య నమ్రత ఒకవైపు ఇంటి బాధ్యతలను చూసుకుంటూనే మరోవైపు మహేష్ బాబుకు సంబంధించిన విషయాలను బిజినెస్ వ్యవహారాలను కూడా చూసుకుంటూ ఉంటుంది.

ఇక ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ తనకు తన ఫ్యామిలీకి సంబంధించిన విషయాలను పంచుకుంటూ ఉంటుంది నమ్రత.ఇది ఇలా ఉంటే గత ఏడాది మహేష్ బాబు తండ్రి కృష్ణ మరణించడంతో కొద్దిరోజులపాటు షూటింగ్ కు గ్యాప్ ఇచ్చిన విషయం తెలిసిందే.

Telugu Mahesh Babu, Namarata, Rajamouli, Sitara, Tollywood, Trivikram-Movie

కృష్ణ మరణించిన తర్వాత కొద్ది రోజులకి ఆ బాధ నుంచి బయటపడడం కోసం మహేష్ బాబు తన ఫ్యామిలీతో కలిసి వెకేషన్ కి వెళ్లి వచ్చారు.చాలా గ్యాప్ తర్వాత మహేష్ బాబు ఇటీవల సెట్ లో మళ్ళీ అడుగు పెట్టాడు.దీంతో ఇప్పుడప్పుడే త్రివిక్రమ్ మహేష్ బాబుని వదిలేలా కనిపించడం లేదు.ప్రస్తుతం మహేష్ సినిమాలో నటిస్తూ బిజీగా ఉండడంతో ఈసారి వెకేషన్ కు కేవలం నమ్రత సితార మాత్రమే ప్లాన్ చేసినట్టుగా తెలుస్తోంది.

Telugu Mahesh Babu, Namarata, Rajamouli, Sitara, Tollywood, Trivikram-Movie

తాజాగా నమ్రత,సితార( Namrata ) ఇద్దరు క లిసి ఎయిర్ పోర్ట్ లో సందడి చేశారు.ఇద్దరు వెకేషన్ వెళ్తున్నట్టు తెలుస్తోంది.మహేష్ బాబు సినిమాలో బిజీగా ఉండగా కొడుకు గౌతమ్ విదేశాలలో చదువుకుంటూ అక్కడే ఉంటున్నాడు.అయితే ఎప్పుడు వెకేషన్ కి వెళ్ళినా కుటుంబం మహేష్ బాబుతో తప్పకుండా వెళుతుంది.

మహేష్ బాబు లేకుండా నమ్రత,సితార వెకేషన్ కు వెళ్లడం మొదటిసారి అని చెప్పవచ్చు.నమ్రత సితార ఇద్దరు కలిసి గౌతమ్ దగ్గరికి వెళ్తున్నారా లేదంటే ఇతర ప్రదేశానికి వెళ్తున్నారా అన్నది తెలియాల్సి ఉంది.

ఆ ఫోటోలను చూసిన అభిమానులు హమ్మయ్య మా మహేష్ బాబుని వదిలేసారా.సంతోషం,ఇప్పటికే షూటింగ్ చాలా లేట్ అయింది ఇప్పుడు మళ్ళీ వెకేషన్ లు అంటే సినిమా ఇంకా ఆలస్యంగా విడుదల అవుతుంది అని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube