రాయలసీమ జిల్లాలలో( Rayalaseema ) చిత్తూరులోని కొన్ని నియోజకవర్గాలలో తప్ప మిగిలిన అన్ని చోట్ల వైసిపి దే రాజ్యం గా చెబుతారు .ఇక్కడ ఆ పార్టీకి ఎదురు ఉండదని.
పంచాయతీ మెంబర్ మొదలుకొని పార్లమెంట్ స్థానం వరకు ఇక్కడ వైసిపి అభ్యర్థులే విజయం సాధిస్తారు.సీట్ల కోసం సొంత పార్టీ నేతల మధ్యనే పోటీ ఉంటుంది .కొంతమంది రెబల్ అభ్యర్థులుగా కూడా పోటీ చేస్తారు ఆ స్థాయిలో వైసిపి ( YCP )కిక్కిరిసిపోయి ఉంటుంది .అంతగా ఆ పార్టీ ప్రభావం చూపుతుంది అలాంటి పార్టీకి ఇప్పుడు రాయలసీమ తూర్పు, పశ్చిమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఫలితాలు( MLC Elections ) మింగుడు పడటం లేదని చెప్పాలి.ఈ ఫలితాలకు ఏం సమాధానం చెప్పాలో కూడా నాయకులకు అర్థం కావడం లేదు.
ఇప్పుడు వారు ఈ పరిస్థితి కి కొత్త కారణాలు వెతుక్కుంటున్నారు.
ఏది ఏమైనా అకౌంట్లో కొంత డబ్బు వేస్తూ దాన్నే అభివృద్ధి అనుకోమంటున్న ప్రభుత్వ పనితీరు సర్వత్రా విమర్శల పాలవుతుంది కానీ దాన్ని అర్థం చేసుకోని ప్రభుత్వం 175కి 175 స్థానాలు మావే అనుకుంటూ జబ్బలు చరుచుకుంటుంది ఇప్పుడు గ్రౌండ్ లెవెల్ రియాలిటీ తో దిమ్మ తిరిగి బొమ్మ కనబడినట్టు అయ్యింది…కనీస మౌలిక సదుపాయాలు, సాంకేతిక అభివృద్ధి, ఉద్యోగాల కల్పన, నిత్యవసర దరలు అదుపులో ఉంచడం ఇలాంటి అనేక అంశాలు ప్రజల ఆలోచనల మీద ప్రత్యక్ష ప్రభావం చూపిస్తాయి.

వీటి మీద దృష్టి పెట్టడంలో నిర్లక్ష్యం వహించిన ప్రభుత్వం నీకింత నాకింత పద్ధతిలో డబ్బు జమ చేయటం ఆ పార్టీకి వ్యతిరేకంగా మారినట్లు విశ్లేషణలు వినిపిస్తున్నాయి.అంతేకాకుండా ఎమ్మెల్యేలకి సరైన సముచిత స్థానం ఇవ్వకుండా నిర్ణయాలని ఏక వ్యక్తి కేంద్రంగా జరుగుతున్నాయని,.ప్రజాభిప్రాయ సేకరణ ప్రజలచే ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధుల ద్వారా కాకుండా ప్రజల్లో పట్టు లేనటువంటి థర్డ్ పార్టీ ఏజెన్సీల ద్వారా తీసుకోవడం కూడా ప్రజాభిప్రాయన్ని సరిగ్గా పరిగణించలేదని అర్థమవుతుంది.

అభివృద్ధి పనులకు నిధులు కేటాయించకపోవడంతో ఎమ్మెల్యేలకు చేయడానికి పనే లేకుండా పోయింది .ఇక వాళ్ళు ప్రజల మద్దతు ఎలా కూడగట్టగలుగుతారు.పైగా పనులు చేయకుండా ఇంటింటికి తిరుగుతున్న ఎమ్మెల్యేలకు ప్రజల్లో నిరసనలు ఎదురవటంతో ఎమ్మెల్యేలు కూడా నిర్వేదం గా ఉండిపోతున్నారు.ఇప్పటికైనా గ్రౌండ్ లెవెల్ లో జరుగుతున్న వ్యతిరేకతను ప్రజాభిప్రాయాన్ని సరిగ్గా పరిగణలోకి తీసుకొని దిద్దుబాటు చర్యలు తీసుకోకపోతే రానున్న ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వానికి ఒక పీడకలలా మిగిలిపోతాయి అనడం లో అతిశయోక్తి లేదు .







