రాజన్న సిరిసిల్ల జిల్లా : ఆడబిడ్డ పెళ్లికి పుస్తె మట్టెలు పెండ్లి చీర అందజేసిన బీజేపీ నాయకులు లగిశెట్టి శ్రీనివాస్.తంగళ్ళపల్లి మండలం బద్దేనపల్లి గ్రామానికి చెందిన నక్క సంధ్యారాణి -విజయ్ కుమార్ ల కూతురు ఊర్మిళ వివాహం తేదీ 17-3-2023 రోజున ఉన్నందున వారికి అందజేశారు.
అలాగే ఇందిరమ్మ కాలనీకి చెందిన మంచే మైసాద్రి – లలిత ల కూతురు స్వాతి వివాహం 18-3-2023 న ఉన్నందున రెండు కుటుంబాలకు పెండ్లిలకు తనవంతు సహాయంగా పుస్తె మట్టెలు,గాజులు, పట్టు చీరలు ఆందజేసి అండగా నిలిచిన బీజేపీ నాయకులు లగిశెట్టి శ్రీనివాస్.ఈ సందర్భంగా లగిశెట్టి శ్రీనివాస్ లకు కృతజ్ఞతలు తెలిపిన వధువు కుటుంబ సభ్యులు, గ్రామ ప్రజలు.
ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు,గ్రామ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.