పుదుచ్చేరిలో H3N2 వైరస్ తీవ్ర కల్లోలం సృష్టిస్తోంది.దేశవ్యాప్తంగా ఇన్ఫ్లుఎంజా కేసులు పెరుగుతుండగా పుదుచ్చేరిలో ఇప్పటివరకు 80కి పైగా కేసులు నమోదు అయినట్లు తెలుస్తోంది.
H3N2 వైరస్ వ్యాప్తి నేపథ్యంలో పుదుచ్చేరి ప్రభుత్వం అప్రమత్తం అయింది.ఈ క్రమంలోనే కీలక నిర్ణయం తీసుకుంది.
రేపటి నుంచి 26 వరకు అన్ని స్కూళ్లను మూసివేస్తున్నట్లు ప్రకటించింది.కాగా పెరుగుతున్న కేసులను నియంత్రించేందుకు ఇప్పటికే ఆస్పత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ప్రత్యేక బూత్ లను ఏర్పాటు చేసింది సర్కార్.H3N2 వైరస్ వ్యాప్తిపై ప్రజలు ఆందోళన చెందవద్దని, అప్రమత్తంగా ఉండాలని సూచించింది.







