ఈ మధ్యకాలంలో స్టార్ హీరోలు ఎటువంటి ఈవెంట్లకు వెళ్ళినా కూడా వారు ధరించే బట్టలు వాచ్, షూస్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.దీంతో నెటిజన్స్ వాటి గురించి సోషల్ మీడియాలో ఆరా తీయడం మొదలు పెడుతున్నారు.
ఈ మధ్యకాలంలో ఎక్కువగా రామ్ చరణ్( Ram Charan ) ఈ విషయాలలో టాప్ లో నిలుస్తున్నాడని చెప్పవచ్చు.చెర్రీ ఎక్కడికి వెళ్లినా కూడా అత్యంత ఖరీదైన బ్రాండ్ వస్తువులనే ధరిస్తూ సోషల్ మీడియాలో నిలుస్తున్నాడు.
ఇది ఇలా ఉంటే తాజాగా ఆస్కార్ ఈవెంట్ కోసం అమెరికా వెళ్ళిన చరణ్,తారక్ లు సందడి చేసిన విషయం తెలిసిందే.

మన హీరోలు వేసుకున్న కాస్ట్యూమ్స్ వాచ్, షూష్ ఇలా ప్రతీది బ్రాండెడ్ అండ్ కాస్ట్లీవి ఉపయోగించారు.దాంతో కొంతమంది నెటిజన్ల కన్ను ఈ ఇద్దరు హీరోలు వాడిన కాస్ట్లీ ఐటమ్స్ పై పడింది.ఈక్రమంలో ఎన్టీఆర్ వాచ్ పై ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎన్నో రకాల చర్చలు కూడా నడుస్తున్నాయి.
నెటిజన్స్ ఎన్టీఆర్ ధరించిన ఆ ఖరీదైన వాచ్ గురించి సోషల్ మీడియాలో ఆరా తీశారు.యంగ్ టైగర్ పెట్టుకున్న వాచ్ Patek Phillipe Nautilus Travel Time.ఈ వాచ్ రేటు అక్షరాలా రూ.1,90,000 డాలర్స్.అనగా మన ఇండియన్ కరెన్సీ ప్రకారం 1 కోటి 56 లక్షల 13,155 గా ఉంది.

ఆ వాచ్ ఖరీదు తెలిసి చాలామంది నోరెళ్లబెడుతున్నారు.వామ్మో ఎన్టీఆర్ అంత ఖరీదైన వాచ్ ని ధరించాడా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.కేవలం ఎన్టీఆర్ ధరించిన వాచ్ మాత్రమే కాకుండా షూస్, షూట్ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
అలాగే చెర్రీ ధరించిన ప్రతి ఒక్కటి కూడా ఖరీదైనవి అన్న విషయం తెలిసిందే.అయితే ఎన్టీఆర్ తో పోల్చుకుంటే ఖరీదైన వస్తువుల విషయంలో ఎక్కువగా చరణ్ వార్తల్లో నిలుస్తూ ఉంటాడు.







