టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత(Samantha), అక్కినేని నాగచైతన్య(Akkineni Naga Chaitanya) ల గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ఈ జంట ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.
కానీ పెళ్లయిన తర్వాత 4 ఏళ్ళకే అనగా 2021 అక్టోబర్ 2వ తేదీన తాము విడిపోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు చైతన్య, సమంత.అయితే అప్పట్లో ఈ వార్త సంచలనంగా మారిన విషయం తెలిసిందే.
విడాకులు తీసుకొని ఏడాదిన్నర గడిచిపోతున్నా కూడా ఇప్పటికీ విడాకులకు గల అసలు కారణం ఏంటి అనేది ఇంకా వెల్లడించలేదు.విడాకుల తరువాత ఎవరికి వారే యమునా తీరే అన్న విధంగా ఎవరికి ఎవరు ఏమి కారు అన్న విధంగా ఒకరికొకరు సంబంధం లేదు అన్న విధంగా వారి పని వారు చేసుకుంటూ వెళుతున్నారు.

విడాకుల తర్వాత స్నేహితులుగా ఉంటాము అని ప్రకటించిన సమంత నాగచైతన్య ఫ్రెండ్షిప్ మాటలు కూడా పక్కన పెట్టేసి కనీసం పుట్టినరోజు వేడుకలకు కూడా బర్త్డే విషెస్ లు చెప్పుకోవడం లేదు.అయితే నాగచైతన్య సమంత విడాకులకు గల కారణం ఏంటి అనేది ఇప్పటికీ సస్పెన్షన్ గానే మారింది.ఈ క్రమంలోనే వారిద్దరూ విడిపోవడానికి గల కారణం ఇదే అంటూ ఇప్పటికే సోషల్ మీడియాలో ఎన్నో రకాల వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే.కానీ ఆ వార్తలపై సమంత, చైతన్య ఇంతవరకు స్పందించలేదు.
ఇలా ఉంటే తాజాగా సెన్సార్ సభ్యుడు, సినీ విమర్శకుడు ఉమైర్ సంధు(Umair Sandhu) పెట్టిన ట్వీట్ సెన్సేషనల్ గా మారింది.నాగ చైతన్య వేధింపుల కారణంగానే సమంత ఆయనతో విడిపోయారంటూ సంచలన కామెంట్స్ చేశారు ఉమైర్ సంధు.

ఈ సందర్బంగా సోషల్ మీడియాలో ట్వీట్ చేస్తూ.నాగ చైతన్య ఓ బ్యాడ్ హస్బెండ్.మానసికంగా, శారీరకంగా నన్ను ఇబ్బంది పెట్టాడు.నేను గర్భం దాల్చితే అబార్షన్ చేయించుకోవాల్సి వచ్చింది.
అతని వేధింపులు తట్టుకోలేకే, విడిపోయాను అని సమంత చెప్పినట్లు ఉమర్ సంధు తన ట్వీట్ లో పేర్కొన్నారు.ఈ ట్వీట్ తో ఒక్కసారిగా టాలీవుడ్ సినీ వర్గాల్లో చై,సామ్ డివర్స్ ఇష్యూ హాట్ టాపిక్ గా మారింది.
మరి ఈ ట్వీట్ పై నాగచైతన్య సమంత ఏ విధంగా స్పందిస్తారు అన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.







