మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది.ఇందులో భాగంగా కడప ఎంపీ అవినాశ్ రెడ్డి సీబీఐ విచారణకు హాజరైయ్యారు.
విచారణలో భాగంగా నాలుగో సారి ఎంపీ అవినాశ్ రెడ్డిని అధికారులు ప్రశ్నిస్తున్నారు.సీబీఐ ఎస్పీ రామ్ సింగ్ బృందం అవినాశ్ ను విచారిస్తున్నారని తెలుస్తోంది.
మరోవైపు ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి సీబీఐ కార్యాలయానికి వచ్చారని సమాచారం.







