నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) హీరోగా కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal)హీరోయిన్ గా రూపొందుతున్న సినిమా లో శ్రీలీల కీలక పాత్రలో కనిపించబోతున్న విషయం తెల్సిందే.ఇటీవలే ఈమె చిత్రీకరణ లో పాల్గొంటుంది అంటూ యూనిట్ సభ్యులు ఒక స్టిల్ ను విడుదల చేయడం జరిగింది.
ఆ స్టిల్ లో బాలకృష్ణ చేయి మాత్రమే కనిపించింది. శ్రీలీల(Srileela) యొక్క లుక్ ను ఆ ఫొటోలు రివీల్ చేశారు.
పెళ్లి సందడి సినిమా తో ఇండస్ట్రీకి పరిచయం అయిన ముద్దుగుమ్మ శ్రీలీల మరోసారి అలరించే విధంగా ఈ సినిమాలోని పాత్రతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.బాలకృష్ణ కు కూతురు పాత్రలో నటించాల్సిన అవసరం ఏంటీ అంటూ కొందరు విమర్శలు చేస్తూ ఉంటే మరి కొందరు మాత్రం కొత్తగా ప్రయత్నిస్తున్నందుకు అభినందనలు అంటున్నారు.
ఇక మొన్ననే చిత్రీకరణ లో జాయిన్ అయినట్లుగా ప్రకటన వచ్చింది.ఇంతలోనే యూనిట్ సభ్యులు శ్రీలీల యొక్క ఎపిసోడ్ పూర్తి అయ్యిందని పేర్కొన్నారు.

అన్ని వర్గాల వారిని అలరించే విధంగా ఈ సినిమాలోని బాలయ్య.శ్రీలీల కాంబో సెంటిమెంట్ సన్నివేశాలు ఉంటాయని అభిమానులు చాలా ధృమాతో ఉన్నారు.శ్రీలీల ధమాకా సినిమా(Dhamaka) తో సూపర్ హిట్ ను దక్కించుకున్న శ్రీలీల ఈ సినిమా తో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకునే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.ఒక వైపు మహేష్ బాబుకు జోడీగా నటిస్తూనే మరో వైపు బాలకృష్ణ కు కూతురు పాత్రలో కనిపించబోతున్న నేపథ్యం లో సాధ్యమైనంత వరకు ఈ అమ్మడి యొక్క ప్రతిభను చూసే అవకాశాలు ఉన్నాయి.
భారీ ఎత్తున శ్రీలీల యొక్క పాత్ర కు ఈ సినిమా లో వెయిట్ ఉంటుందని.కనుక తప్పకుండా ఆ సినిమా యొక్క పాత్రతో తప్పకుండా స్టార్ హీరోయిన్ గా ఈ అమ్మడు నిలిచే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.







