TSPSC కంప్యూటర్లు హ్యాకింగ్.. పరీక్షలు వాయిదా..!

TSPSC కంప్యూటర్లు హ్యాకింగ్ కు గురయ్యాయి.దీనితో ఈ నెల 12వ తేదీ నిర్వహించాల్సిన టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీస్ పరీక్ష ను, ఈనెల 15, 16 తేదీలలో నిర్వహించాల్సిన వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పరీక్షను వాయిదా వేసినట్లు ప్రధాన కార్యదర్శి అనితా రామచంద్రన్ (General Secretary Anita Ramachandran)తెలిపారు.

 Hacking Tspsc Computers Exams Postponed-TeluguStop.com

అభ్యర్థులకు పరీక్షలు వాయిదా పడ్డ విషయాన్ని ఎస్ఎంఎస్ ద్వారా సమాచారం అందించింది టీఎస్పీఎస్సీ.అయితే 12 వ తేదీన జరగాల్సిన పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.ఓఎంఆర్ షీట్లు, ప్రశ్న పత్రాలు కూడా పరీక్షా కేంద్రాలకు చేరాయి.11వ తేదీ కంప్యూటర్లు హ్యాకింగ్ గురైన విషయం బయట పడడంతో పరీక్ష వాయిదా వేయాలని టీఎస్పీఎస్సీ నిర్ణయం తీసుకుంది.

Telugu Tspsc, Latest Telugu, Omr Sheets, Papers-Latest News - Telugu

టీఎస్పీఎస్సీ కంప్యూటర్లలో ఉండే అత్యంత రహస్య సమాచారం లీకైన విషయాన్ని ఒక యువకుడు గుర్తించి పోలీసులకు సమాచారం అందించడంతో, పోలీసులు కమిషన్ కార్యాలయంలోని అధికారులకు ఒకసారి లాగిన్ అయ్యి చెక్ చేయాల్సిందిగా చెప్పడంతో, కంప్యూటర్ లోని సాఫ్ట్ కాపీ హ్యాకింగ్ గురైన విషయం బయట పడింది.దీనితో టీఎస్పీఎస్సీ(TSPSC) అధికారులు బేగం బజార్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.పోలీసులు కేసు నమోదు చేసుకుని, కమిషన్ లోని కంప్యూటర్లలో ఉండే అత్యంత రహస్య సమాచారం హ్యాకింగ్ అయిందంటే ఇందులో ఏదో పెద్ద కుంభకోణం ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు.కీలక హోదాల్లో ఉండే అధికారుల లాగిన్ వివరాలతో కంప్యూటర్లను తెరచినట్లు గుర్తించారు.

Telugu Tspsc, Latest Telugu, Omr Sheets, Papers-Latest News - Telugu

అందులో ఉండే సాఫ్ట్ కాపీని హ్యాకింగ్ చేసి సమాచారని తీసుకున్నారు.అన్ని కోణాల్లో దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకొని రహస్యంగా విచారణ చేస్తున్నారు.కమిషన్ సిబ్బంది సహకారంతో హ్యాకింగ్ జరిగి ఉండొచ్చని పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.వీలైనంత తొందరలో హ్యాకింగ్ కు పాల్పడ్డ నిందితులను పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.వాయిదా పడ్డ పరీక్షలు జరిగే తేదీని త్వరలోనే వెల్లడిస్తామని టీఎస్పీఎస్సీ తెలిపింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube